
Mokshagna Nandamuri : మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఉత్కంఠ.. ఎంట్రీ ఎప్పుడో చెప్పేసిన నారా రోహిత్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుతం నందమూరి కుటుంబ అభిమానులు మాత్రమే కాక, మొత్తం సినీ ప్రేక్షకులు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో మోక్షజ్ఞ కొత్త లుక్ వైరల్ అయింది. దీనిపై నారా రోహిత్ (Nara Rohit) ఒక ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇండస్ట్రీకి వచ్చేందుకు ఈ నందమూరి వారసుడు చాలా ఆసక్తిగా ఉన్నాడని తెలిపారు.
వివరాలు
ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ కోసం వెతుకుతున్నమోక్షజ్ఞ
"ఇటీవలి కాలంలో మోక్షజ్ఞతో మాట్లాడినప్పుడు కూడా స్క్రిప్ట్ కోసం ఆసక్తి చూపిస్తున్నాడని తెలిసింది. ఈ ఏడాది చివరి లేదా వచ్చే సంవత్సరం ప్రారంభంలో అతని ఎంట్రీని చూడవచ్చు. ఇండస్ట్రీకి రావడం కోసం మోక్షజ్ఞ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. సినిమాల కోసం లుక్‌లో పెద్ద మార్పు చేసుకున్నాడు. గతంలో ఉన్న లుక్ తో పోలిస్తే ఇప్పుడు చాలా విభిన్నంగా ఉంది. ఇటీవల కలిసినప్పుడు, ఫీల్‌గుడ్ లవ్ స్టోరీ కోసం తగిన కథను వెతుకుతున్నాడని కూడా చెప్పాడు. అలాంటి కథ ఉంటే ఈ ఏడాదే అతని ఎంట్రీ అయ్యే అవకాశముంది" అని నారా రోహిత్ తెలిపారు.
వివరాలు
బాలకృష్ణతో మల్టీ స్టారర్‌పై నారా రోహిత్
అంతేకాదు, బాలకృష్ణతో (Balakrishna) చేస్తున్న మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ గురించి కూడా నారా రోహిత్ స్పందించారు. గతంలో స్క్రిప్ట్ రెడీ చేసినట్లు చెప్పారు.ఇద్దరికీ లుక్ టెస్ట్ కూడా పూర్తయిందని చెప్పారు. "కథ నచ్చింది.. కానీ ఆ సమయంలో ఆయనకు వరుస సినిమాలు, ఎన్నికల బిజీ షెడ్యూల్ ఉండడంతో ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. బాలయ్య నటించిన మరో సినిమాలోనూ నేను అతిథి పాత్రలో నటించాల్సి వచ్చింది, కానీ కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. ఆ ప్రాజెక్ట్ స్థానంలోనే ఆయన 'లెజెండ్' సినిమా చేశారు. భవిష్యత్తులో బాలయ్యతో కలిసి నటించే అవకాశం వస్తే, దానిని తప్పకుండా చేస్తాను."అని నారా రోహిత్ పేర్కొన్నారు.
వివరాలు
ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు 'సుందరకాండ'
తన రాజకీయ రంగ ప్రవేశం గురించి మాట్లాడుతూ.. తాను సమయం వచ్చినప్పుడల్లా కార్యకర్తలను కలుస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు మంచి చేయడం కోసం తానెప్పుడూ సిద్ధమేనన్నారు. ప్రస్తుతం నారా రోహిత్ నటించిన చిత్రం 'సుందరకాండ' (Sundarakanda) విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో ఆయన కథానాయకుడిగా, కొత్త దర్శకుడు వెంకటేశ్ నిమ్మలపూడి దర్శకత్వంలో నటించారు. కథానాయికలుగా శ్రీదేవి విజయ్‌కుమార్,వృతి వాఘని నటించారు. ఈ చిత్రం ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల నుండి మంచి స్పందన పొందింది. ప్రధానంగా హీరో పెళ్లి సమస్యలను హాస్యంగా చూపించిన వీడియో ప్రేక్షకులకు నవ్వులు పంచింది. అలాగే, హీరో పరిస్థితిని వివరించే ర్యాప్ సాంగ్ కూడా ప్రేక్షకులను అలరించింది.