బాలకృష్ణ అభిమానులను నిరాశపరుస్తున్న నరసింహనాయుడు రీ రిలీజ్ కలెక్షన్లు
బాలకృష్ణ కెరీర్లో నరసింహనాయుడు సినిమా ప్రత్యేకంగా నిలిచిపోతుంది. బీ గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా, ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. 2001లో రిలీజైన, 8కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాకు మూడురెట్లు లాభం వచ్చింది. తాజాగా ఈ సినిమాను మళ్ళీ విడుదల చేసారు. టాలీవుడ్ రీ రిలీజ్ ల పర్వంలో భాగంగా బాలయ్య అభిమానుల కోసం నరసింహనాయుడు సినిమాను 4కే వెర్షన్ లో డాల్బీ అట్మస్ టెక్నాలజీతో రిలీజ్ చేసారు. అయితే నరసింహనాయుడు రీ రిలీజ్ కలెక్షన్లు చాలా తక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. విడుదలైన నాలుగు రోజుల్లో కేవలం 22లక్షల గ్రాస్, 10లక్షల షేర్ సాధించినట్లు సమాచారం.
కలెక్షన్లు తక్కువ రావడానికి కారణం అదే
రీ రిలీజ్ కు సరైన స్థాయిలో ప్రమోషన్ చేయకపోవడం, కావాల్సినన్ని థియేటర్లు దొరక్కపోవడం మొదలగు కారణాలన్నింటి వల్ల నరసింహ నాయుడు సినిమా రీ రిలీజ్ కలెక్షన్లు చాలా తక్కువగా వచ్చాయని అనుకుంటున్నారు. ప్రస్తుతం ఈ విషయంలో బాలయ్య అభిమానులు కొంత నిరాశతో ఉన్నారు. నరసింహనాయుడు సినిమాలో హీరోయిన్లుగా సిమ్రాన్, ప్రీతి జింగానియా, ఆశా షైనీ నటించారు. అదలా ఉంచితే, ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమాలో నటిస్తున్నాడు బాలయ్య. ఆల్రెడీ రిలీజైన భగవంత్ కేసరి టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాజల్ అగర్వాల్, శ్రీలీల హీరోయిన్లుగా కనిపిస్తున్నారు.