
మాదాపూర్ డ్రగ్స్ కేసు: హీరో నవదీప్‌ను నార్కోటిక్స్ పోలీసుల విచారణ
ఈ వార్తాకథనం ఏంటి
కొన్ని రోజుల క్రితం తెలుగు సినిమా పరిశ్రమలో డ్రగ్స్ కేసు సంచలనంగా మారింది. ఈ కేసులో చాలామంది సెలెబ్రెటీల పేర్లు బయటకు వచ్చాయి.
అయితే మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ ని నిందితుడిగా చేర్చారు. డ్రగ్స్ విక్రేత రాంచందర్ తో నవదీప్ కు సంబంధాలు ఉన్నాయని పోలీసులు తేల్చేశారు.
ఈ క్రమంలో నవదీప్ ను విచారించేందుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో నార్కోటిక్స్ పోలీసుల ముందుకు హీరో నవదీప్ ఈరోజు హాజరయ్యారని తెలుస్తోంది.
రామచందర్ తో ఉన్న ఆర్థిక సంబంధాల గురించి నవదీప్ ని అనేక ప్రశ్నలు అడుగుతున్నారని తెలుస్తోంది.
Details
హైకోర్టులో హైకోర్టును ఆశ్రయించిన నవదీప్
నవదీప్ ను డ్రగ్స్ కేసులో నిందితుడిగా చేర్చిన పోలీసులు ఇప్పటికే అతని ఇంట్లో సోదాలు నిర్వహించారు.
ఒకవేళ నవదీప్ డ్రగ్స్ వాడినట్టు విచారణలో తేలితే రరిహబిలిటేషన్ సెంటర్ కు నార్కోటిక్స్ పోలీసులు పంపించనున్నారని సమాచారం.
నవదీప్ ఒప్పుకుంటే నార్కోటిక్స్ పోలీసులు బ్లడ్ శాంపిల్స్ తీసుకునే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది.
అదలా ఉంచితే, మాదాపూర్ డ్రగ్స్ కేసు విషయంలో ముందస్తు బెయిలు కోసం హీరో నవదీప్ హైకోర్టులో పిటిషన్ వేశారు. కానీ విచారణకు హాజరు కావాల్సిందంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.