వైరల్ అవుతోన్న నరేష్ పవిత్రల పెళ్ళి వీడియో
యాక్టర్ నరేష్, పవిత్రల గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గత కొన్నాళ్ళుగా వాళ్ళిద్దరి పేర్లు సోషల్ మీడీయాలో విపరీతంగా వినిపించాయి. వాళ్ళ మధ్య బంధం గురించి అనేక వార్తలు వచ్చాయి. ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పెడుతూ, 2023 జనవరి 1వ తేదీన ఒక వీడియో రిలీజ్ చేసారు. త్వరలోనే తామిద్దరూ పెళ్ళి చేసుకోబోతున్నట్లు అందులో తెలియజేసారు. అందులో తెలియజేసినట్టుగానే ప్రస్తుతం వాళ్ళిద్దరూ ఒక్కటయ్యారు. నరేష్, పవిత్రల పెళ్ళి వీడియో ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను షేర్ చేసిన నరేష్, అందరి ఆశీర్వాదం కావాలని చెబుతూ, జీవిత కాలం ప్రశాంతం కోసం కొత్త జీవితాన్ని మొదలు పెడుతున్నానని అన్నాడు.
వీడియో మీద వెలువడుతున్న సందేహాలు
యాక్టర్ నరేష్ కు ఇది నాలుగవ పెళ్ళి. అలాగే పవిత్రా లోకేష్ కు ఇది మూడవ పెళ్ళి. యాక్టర్ నరేష్ గతంలో డాన్స్ మాస్టర్ శ్రీను కూతురును వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత దేవులపల్లి క్రిష్ణశాస్తి మనవరాలు రేఖ సుప్రియతో ఒక్కటయ్యారు. మూడవ వివాహం, రమ్యతో జరిగింది. నరేష్, పవిత్రలు హోటల్ రూమ్ లో ఉన్నట్లు వీడియో రిలీజ్ చేసినపుడు రమ్య గురించి అందరికీ తెలిసింది. అదంతా పక్కన పెడితే, ప్రస్తుతం రిలీజైన వీడియోపై కొందరికి అనుమానాలు కలుగుతున్నాయి. అది నిజమైన పెళ్ళి వీడియో కాకపోవచ్చని, ఏదైనా సినిమా షూటింగ్ కి సంబంధించినది అయ్యుండవచ్చని అంటున్నారు. కాకపోతే యాక్టర్ నరేష్ స్వయంగా ట్వీట్ చేయడంతో, అబద్ధం అయ్యే అవకాశం ఉందని అనుకుంటున్నారు.