
Bobby Simha: వాహనాల పైకి దూసుకెళ్లిన నటుడు బాబీ సింహా కారు.. ప్రమాదంలో పలువురికి గాయాలు
ఈ వార్తాకథనం ఏంటి
కోలీవుడ్ ,టాలీవుడ్ నటుడు బాబీ సింహాకు చెందిన కారు ఉదయం బీభత్సం సృష్టించింది.
ఈ ఘటన చెన్నైకి సమీపంలో ఉన్న ఎక్కడుతంగల్ నుంచి ఎయిర్‌పోర్ట్ వైపు వెళ్తున్న రోడ్డులో జరిగింది.
బాబీ సింహా కారు పలు వాహనాలపైకి దూసుకెళ్లడంతో అక్కడ ఒక్కసారిగా విషాదవాతావరణం నెలకొంది.
ఈ ప్రమాదంలో అనేక మందికి గాయాలయ్యాయి.మోటారు వాహనాలపై ఒక్కసారిగా వచ్చిన ఈ కారు కారణంగా దాదాపు ఆరు వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలన ప్రారంభించారు.
ప్రాథమిక దర్యాప్తులో డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లు గుర్తించారు.
మద్యం మత్తులో ఉండటం వల్లే ఈప్రమాదం చోటుచేసుకున్నదని పోలీసులు అనుమానిస్తున్నారు. వెంటనే డ్రైవర్‌ను అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వాహనాల పైకి దూసుకెళ్లిన నటుడు బాబీ సింహా కారు
National Award-winning actor Bobby Simha's car was involved in an accident that injured two people, police said. The driver has been arrested for rash driving. As a result, six vehicles, including autos, two-wheelers and cars, were damaged due to the collision.
— IndiaToday (@IndiaToday) April 19, 2025
The accident… pic.twitter.com/olYzjL5jS4