LOADING...
Rashmika Mandhana: నేషనల్ క్రష్ రష్మికకు వరుస హిట్లు.. నాలుగు సినిమాలు రూ.100 కోట్ల క్లబ్‌లో!
నేషనల్ క్రష్ రష్మికకు వరుస హిట్లు.. నాలుగు సినిమాలు రూ.100 కోట్ల క్లబ్‌లో!

Rashmika Mandhana: నేషనల్ క్రష్ రష్మికకు వరుస హిట్లు.. నాలుగు సినిమాలు రూ.100 కోట్ల క్లబ్‌లో!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 03, 2025
11:24 am

ఈ వార్తాకథనం ఏంటి

నేషనల్ క్రష్ రష్మిక మందన్న బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తోంది. వరుస విజయాలతో ఈ ముద్దుగుమ్మ సినిమాలు కోట్ల వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. 2025లో ఇప్పటివరకు రష్మిక నటించిన నాలుగు సినిమాలు రూ.100 కోట్ల మార్క్‌ను దాటేశాయి. తాజాగా వచ్చిన హారర్ థ్రిల్లర్ 'థామా' కూడా ఈ క్లబ్‌లో చేరి ఆమె కెరీర్‌లో మరో ఘనతను సృష్టించింది. థామా కలెక్షన్లు ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహించిన 'థామా' చిత్రం భారతదేశంలో అద్భుతమైన విజయాన్ని అందుకుంటోంది. ట్రేడ్‌ సైట్‌ సక్నిల్క్ ప్రకారం, ఈ సినిమా ఇప్పటివరకు ఇండియాలో రూ.119.65 కోట్లు వసూలు చేసింది. దినేష్ విజన్‌, అమర్ కౌశిక్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Details

ఫస్ట్ వీక్‌లోనే రూ. 100 కోట్లు

విడుదలైన మొదటి వారంలోనే 'థామా' ఇండియాలో రూ.108.4 కోట్లు దాటింది. ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న జంటగా నటించిన ఈ హారర్ కామెడీ థ్రిల్లర్ హిందీ వెర్షన్‌లో రూ.107.52 కోట్లు, తెలుగు వెర్షన్‌లో రూ.88 లక్షలు వసూలు చేసింది. 11వ రోజు రూ.3 కోట్లు, 12వ రోజు రూ.4.4 కోట్లు, 13వ రోజు రూ.3.85 కోట్లు రాబట్టి, ఇప్పటివరకు మొత్తంగా రూ.119.65 కోట్లు సంపాదించింది.

Details

థామా గురించి

మాడాక్‌ హర్రర్ కామెడీ యూనివర్స్‌లో 'థామా' ఐదో చిత్రం. ఇందులో నవాజుద్దీన్ సిద్ధిఖీ, పరేష్ రావల్ ముఖ్య పాత్రల్లో నటించారు. రష్మిక బేతాళిగా, ఆయుష్మాన్ రక్తపిశాచి లాంటి వ్యక్తిగా కనిపిస్తారు. ఒక జర్నలిస్టుగా ఉన్న ఆయుష్మాన్‌ రష్మిక పాత్రతో ప్రేమలో పడడం కథకు ప్రధాన మలుపుగా నిలుస్తుంది. ఇది ప్రేమ, భయం, మలుపులతో నిండిన 'నెత్తుటి ప్రేమకథ'గా నిలిచింది.

Details

వరుసగా నాలుగు వంద కోట్ల సినిమాలు

ఈ ఏడాది రష్మికకు నిజమైన 'గోల్డెన్ ఇయర్' అని చెప్పాలి. 2025లో విడుదలైన ఆమె నాలుగు సినిమాలు రూ.100 కోట్ల మార్క్‌ను దాటాయి. మొదట 'ఛావా' (విక్కీ కౌశల్‌ హీరోగా) - రూ.800 కోట్ల వసూళ్లు. తర్వాత 'సికందర్' (సల్మాన్ ఖాన్‌తో) - మిశ్రమ సమీక్షలున్నా రూ.200 కోట్ల వసూళ్లు. ఆ తర్వాత 'కుబేర' (ధనుష్‌, నాగార్జునతో) - రూ.130 కోట్ల వసూళ్లు. తాజాగా 'థామా' - రూ.119.65 కోట్లతో జాబితాలో చేరింది. ఇందుకుముందు 'యానిమల్', 'పుష్ప 2' వంటి భారీ చిత్రాలతో కూడా వసూళ్ల హవా సృష్టించిన రష్మిక, ఇప్పుడు రూ.100 కోట్ల క్లబ్‌లో వరుసగా ఆరో సినిమాతో మరోసారి తన దూకుడు చాటుకుంది.