
NTR : 'డ్రాగన్' మూవీలో తారక్‌తో కలిసి నేషనల్ క్రష్ స్టెప్పులు..?
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియన్ సినిమా పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ప్రశాంత్ నీల్ - జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రాజెక్ట్ ఒకటి.
ఈభారీ చిత్రం చాలా కాలం క్రితమే అనౌన్స్ అయినప్పటికీ ఇప్పుడు ఫైనల్‌గా సెట్స్ పైకి చేరింది.
మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తున్నారు.
ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ షూటింగ్‌లో జాయిన్ అయినట్లు సమాచారం.
తన పాత్రకు తగ్గట్టుగా ఆయన లుక్‌లో భారీ మార్పులు చేసుకున్నాడు. పూర్తిగా స్లిమ్ అవతారంలో, అభిమానులు ఊహించలేనంతగా బక్కచిక్కిన విధంగా మారిపోయాడు. తాజాగా ఫస్ట్ షెడ్యూల్‌ను ఎన్టీఆర్ పూర్తి చేసినట్లు సమాచారం.
ఇక ఇప్పుడు ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన అప్‌డేట్ వైరల్ అవుతోంది.
Details
స్పెషల్ సాంగ్ రష్మిక మందాన్న
ఈ చిత్రంలో ఓ గ్రాండ్ స్పెషల్ సాంగ్ ఉండనుందని, అందులో నేషనల్ క్రష్ రష్మిక మందాన్నా కనిపించనుందంట.
ఇప్పటికే దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆమెను సంప్రదించగా, రష్మిక ఈ పాటకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్. ఈ పాట సినిమాలో సెకండ్ హాఫ్‌లో చోటు చేసుకోనుందని సమాచారం.
అయితే ఇది కథలో భాగంగా అంతే గ్రాండియస్‌గా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
ప్రస్తుతం రష్మిక కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉంది. ఆమె చేతిలో అరడజను కంటే ఎక్కువ సినిమాలు ఉన్నా, ఎన్టీఆర్ సినిమా కోసం స్పెషల్ సాంగ్‌కి ఒప్పుకోవడం ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది.
ఇక ఈ క్రేజీ కాంబో వెండితెరపై కనిపిస్తే మాత్రం అభిమానులకు పండుగే అని చెప్పవచ్చు.