
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ట్రైలర్ రిలీజ్.. కడుపుబ్బా నవ్విస్తున్న తారాగణం
ఈ వార్తాకథనం ఏంటి
ఫ్యామిలీ కామెడీ అండ్ లవ్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి(Miss Shetty Mr Polishetty) నుంచి తాజా అప్ డేట్ వచ్చింది. ఈ మేరకు ఇవాళ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేసింది చిత్రబృందం.అనుష్క శెట్టి,నవీన్ పొలిశెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
పి.మహేశ్‌బాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ సెప్టెంబర్ 7న థియేటర్లలో విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర ట్రైలర్‌ను సోమవారం విడుదల అయ్యింది.
ఇందులో అనుష్క శెట్టి నటన, నవీన్ శెట్టి కామెడీ టైమింగ్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. హీరో, హీరోయన్లపై చిత్రీకరించిన సన్నివేశాలు సినీ ప్రేక్షకులను బాగా నవ్విస్తున్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఆకట్టుకుంటున్న మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ట్రైలర్
The trailer of #MissShettyMrPolishetty is all set to work up your appetite for comedy and entertainment! #MSMPTrailer - https://t.co/UQfI6Xo6kZ
— UV Creations (@UV_Creations) August 21, 2023
Grand release on September 7th! #MSMPonSep7th @MsAnushkaShetty @NaveenPolishety @filmymahesh @adityamusic @UV_Creations pic.twitter.com/LxhgRPHkp9