జవాన్ విజయంతో నయనతారకు బాలీవుడ్ లో మరో బంపర్ ఆఫర్.. వివరాలివే
లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ నయనతార ప్రస్తుతం జవాన్ సినిమాతో బాలీవుడ్ లోనూ అడుగు పెట్టారు. షారుక్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాసింది. ఈ సినిమా విజయంతో నయనతారకు బాలీవుడ్ లోనూ అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఒకానొక బాలీవుడ్ సినిమాను నయనతార ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలి రూపొందిస్తున్న రొమాంటిక్ డ్రామా కోసం నయనతారను సంప్రదించారని టాక్. బైజు బావ్రా అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాలో రణ్వీర్ సింగ్, ఆలియా భట్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
బయటకు రాని అధికారిక సమాచారం
బైజు బావ్రా సినిమాలో నయనతార కూడా నటించనుందని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ విషయమై ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. కానీ సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే నయనతారకు బాలీవుడ్ లో మరో మంచి లక్కీ ఛాన్స్ దొరికినట్టే. మరేం జరుగుతుందో చూడాలి. అదలా ఉంచితే, నయనతార నటించిన జవాన్ చిత్రం బాక్సాఫీసు వద్ద 1100కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో రూపొందిన జవాన్ చిత్రాన్ని దర్శకుడు అట్లీ తెరకెక్కించారు. దీపికా పదుకొణె అతిథి పాత్రలో కనిపించిన ఈ సినిమాకు అనిరుధ్ రవించదర్ సంగీతం అందించారు.