ప్రభాస్ కంటే బాలయ్య చాలా ఎక్కువ.. నయనతార
ఈ మధ్య పెద్దగా తెలుగు సినిమాల్లో కనిపించని నయనతార, తమిళ అనువాద చిత్రం కనెక్ట్ తో తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అవనుంది. ఈ సినిమా డిసెంబర్ 22వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది. ఆ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడి చేసింది. ముఖ్యంగా బాలక్రిష్ణ గురించి మాట్లాడుతూ అందరికంటే అతిపెద్ద ఆకతాయి బాలయ్య అని చెప్పింది. సెట్ లో అందరూ ఆయన్ని చూసి భయపడతారని, ఓసారి సెట్ లో ఫోకస్ సరిగ్గా రాలేదని బాలక్రిష్ణ గారికి చెప్పడానికి సెట్ లోని పర్సన్ చాలా భయపడ్డారని, కానీ చెప్పిన తర్వాత , దానిదేముంది రీ టేక్ చేద్దామని చాలా సింపుల్ గా అన్నారని అంది.
ప్రభాస్ కంటే ఎక్కువ ఆకతాయి
నేను బాలక్రిష్ణ గారితో మూడు సినిమాలు చేసాను. మూడు సినిమాల్లో కూడా ఎక్కడా నేను ఇబ్బందిగా ఫీలవ్వలేదు. బాలక్రిష్ణ గారు చాలా హ్యాపీ పర్సన్. సెట్ లో ప్రభాస్ అల్లరి చేస్తాడని చెప్పాను కదా, ప్రభాస్ కంటే ఎక్కువగా బాలక్రిష్ణ గారు అల్లరి చేస్తారు, ఆకతాయిగా ఉంటారు అని తెలియజేసింది. మరి తెలుగు సినిమాల్లో ఎప్పుడు కనిపిస్తారని అడిగితే, త్వరలోనే కనిపిస్తానని, ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నట్లు తెలిపింది. కనెక్ట్ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల అవుతుంది. హిందిలో డిసెంబర్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనుపమ్ ఖేర్, సత్యరాజ్ ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు.