Page Loader
కవల పిల్లల పేర్లు బయటపెట్టిన నయనతార, పలకడానికి కష్టంగా ఉందంటూ కామెంట్స్
కవలపిల్లల పేర్లను వెల్లడి చేసిన నయనతార

కవల పిల్లల పేర్లు బయటపెట్టిన నయనతార, పలకడానికి కష్టంగా ఉందంటూ కామెంట్స్

వ్రాసిన వారు Sriram Pranateja
Apr 03, 2023
06:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

హీరోయిన్ నయనతార కవల పిల్లల పేర్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సరోగాసీ ద్వారా కవలలకు జన్మనిచ్చిన సయనతార, తాజాగా పిల్లల పేర్లేంటో తెలియజేసింది. ఉయిర్ రుద్రోనిల్ ఎన్ శివన్, ఉలగ్ దీవిక్ ఎన్ శివన్ అనే పేర్లను తన పిల్లలకు పెట్టుకున్నట్లు నయన తార వెల్లడి చేసింది. ఇదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేసిన నయనతార భర్త విఘ్నేష్ శివన్, ఈ పేర్లలో ఎన్ అంటే నయనతార అనీ, గ్రేట్ మదర్ అనీ నయనతారపై ప్రశంసలు కురిపించాడు. కవల పిల్లల పేర్లు పలకడానికి కష్టంగా ఉన్నాయని విఘ్నేశ్ శివన్ పోస్టుకు నెటిజన్లు రిప్లై ఇస్తున్నారు. నయనతార ప్రస్తుతం షారుఖ్ ఖాన్ సరసన జవాన్ సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కవలపిల్లల పేర్లను వెల్లడి చేసిన నయనతార