జవాన్ విషయంలో దర్శకుడు అట్లీపై నయనతార అప్సెట్? కారణం అదేనా?
లేడీ సూపర్ స్టార్ నయనతార జవాన్ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. షారుక్ ఖాన్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇప్పటివరకు 900 కోట్లు వసూలు చేసింది. అయితే జవాన్ విషయంలో దర్శకుడు అట్లీపై నయనతార అప్సెట్ అయ్యిందని అనేక వార్తలు వస్తున్నాయి. జవాన్ సినిమాలో తన పాత్రకు తగినంత ప్రాధాన్యం ఇవ్వలేదని, దీపిక పదుకొణె పాత్రను డిజైన్ చేసినట్టుగా తన పాత్రను డిజైన్ చేయలేదని అందుకే నయనతార అప్సెట్ అయ్యారని వార్తలు వస్తున్నాయి. హీరోయిన్ గా నటించిన తనకు స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉందనీ, అతిథి పాత్రలో నటించిన దీపికా పదుకొణె ఎక్కువ సేపు తెరమీద కనిపించిందని. అందువల్లే నయనతార అప్సెట్ అయ్యారని అన్నారు.
జవాన్ ప్రమోషన్లలో కనిపించని నయనతార
తన పాత్రకు కావాల్సిన అంత స్కోప్ ఇవ్వలేదని విషయంలో నయనతార అప్సెట్ అయ్యిందని అనేక వార్తలు వచ్చాయి. అందువల్లే జవాన్ సినిమా ప్రమోషన్లలో నయనతార పాల్గొనలేదని కూడా అన్నారు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, నయనతార అప్సెట్ అయిందన్న వార్తలు వట్టి పుకార్లేనని తెలుస్తోంది. నిజానికి నయనతార తన సినిమాల ప్రమోషన్లలో ఎప్పుడూ పార్టిసిపేట్ చేయదు. సినిమాలో నటించడం వరకు మాత్రమే తన జాబ్ అని ప్రమోషన్లకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అందువల్లే ప్రమోషన్లలో పాల్గొనలేదని, అట్లీపై అప్సెట్ అనే వార్తలు నిజం కావని సమాచారం అందుతోంది.