Nayanthara: నయన్ కు ఆధ్యాత్మికత ఎక్కువే.. పిల్లలతో గోపురాల సందర్శన
ఒకప్పుడు ఎలా పెరిగామో ఎవరికీ తెలియదు. అప్పట్లో తాను అనుభవించని చిన్ననాటి జీవితాన్నినయనతార తన కొడుకులతో ఎంజాయ్ చేస్తోంది. తన కొడుకులతోఈ నెల 20 న చెన్నైలోని తిరుచెందూర్, కన్యాకుమారి గుళ్లను చుట్టేసింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లోకి ప్రవేశించిన తర్వాత, చాలా ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేసి మురిసి పోయింది. తనకు మంచి పిల్లలు , భర్త ఉన్నారని చాటి చెప్పింది. తమది ఒక మంచి కుటుంబమని అందరూ చెప్పుకునేలా చేసింది. నయనతార తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పంచుకున్న వీడియోలో,ఇద్దరు పిల్లలను వారి ఒడిలో కూర్చోబెట్టడాన్నిమనం చూడవచ్చు,విఘ్నేష్ ప్రతిబింబం అద్దంలో కనిపిస్తుంది. నయనతార -దర్శకుడు విఘ్నేష్ శివన్ జంటకు కవల పిల్లలు ఉయిర్, ఉలగ్ ఉన్నారు.
నయనతారకు అన్నపూర్ణి మేలు కొలుపా ?
ఇక సినిమాల విషయానికి వస్తే నయనతార చివరిసారిగా వివాదాస్పద చిత్రం 'అన్నపూర్ణి'లో కనిపించింది. భారీ ట్రోలింగ్స్ తర్వాత నెట్‌ఫ్లిక్స్ నుండి ఈ సినిమా తీసి వేయబడింది. ఈ సినిమా హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో హిందూ మహిళ అయి వుండి కూడా ముస్లిం వేష ధారణతో ఆమె చేసిన విన్యాసాలు చిర్రెత్తికించాయి. ఆధ్యాత్మికత ఉంటే ఇలాంటి వేషాలెందుకని ఆమె అభిమానులు ఆగ్రహించారు. మరోపక్క రెండు తమిళ సినిమాలు 'టెస్ట్', '1960 నుండి మన్నంగట్టి' షూటింగ్ ముగించింది. ఇటీవల, ఆమె తన మలయాళ చిత్రం 'డియర్ స్టూడెంట్స్' షూటింగ్ ప్రారంభించింది.