Nayanthara birthday: నయనతార నటించిన సినిమాల్లో తప్పక చూడాల్సినవి ఇవే
దక్షిణాది చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్ నయనతార. తన రెండు దశాబ్దాల సినీ కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన సినిమాలు, పాత్రలను చేసింది. ఇన్నేళ్లయనా కూడా నయనతార వరుస సినిమాతో బిజీగా ఉండటం గమనార్హం. నయనతార శనివారం 39వ పుట్టినరోజు జరుపుకుంటున్న నేపథ్యంలో ఆ కెరీర్‌లో తప్పకచూడాల్సిన 5సినిమాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. కర్తవ్యం.. గోపి నైనార్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం 'అరమ్'. ఈ సినిమా కర్తవ్యం పేరుతో తెలుగులో విడుదలైంది. 2017లో వచ్చిన ఈ మూవీలో నయనతార కలెక్టర్ పాత్రలో మెప్పించింది. అలాగే ఈ సినిమా ఆమె అభిమానులకు బలమైన సామాజిక సందేశాన్ని పంపింది. ఈ సినిమాలో ఏ హీరో లేకుండా, సోలోగా నయనతార నటించింది. మంచి విజయాన్ని అందుకుంది.
'రాజా రాణి'
సెన్షేషన్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించిన తొలి 'రాజా రాణి'. ఈ సినిమాలో ఆర్య, నయనతార ప్రధాన పాత్రలలో నటించారు. ప్రేమ విఫలమైన తర్వాత కూడా అద్భుతమైన జీవితం ఉంటుందన్న కథాంశంతో రొమాంటిక్ డ్రామా ఇది. నయనతార కొత్తగా పెళ్లయిన భార్యగా తన పాత్రలో క్యూట్‌గా కనిపించారు. ఈ సినిమా తెలుగు, తమిళంలో భారీ విజయాన్ని నమోదు చేసింది. 'నేను రౌడీ నే' నయనతార భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన సినిమా 'నేను రౌడీ నే'. ఈ సినిమాలో తమిళంలో 'నానుమ్ రౌడీ ధాన్' పేరుతో రూపొందింది. విజయ్ సేతుపతి, నయనతార ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. వినికిడి లోపం ఉన్న యువతి పాత్రలో నయనతార అద్భుతంగా నటించింది.
'మయూరి'
నయనతార ప్రధాన పాత్రలో 2015లో వచ్చిన హారర్ మూవీ 'మయూరి'. ఈ సినిమాను తమిళంలో మాయ పేరుతో తీశారు. అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా హారర్‌తో హడలెత్తిస్తుంది. తమిళంలో ఉత్తమ హారర్ థ్రిల్లర్‌లలో ఇది ఒకటి. 'యారడి నీ మోహిని' మిత్రన్ జవహర్ దర్శకత్వం వహించిన 'యారడి నీ మోహిని' సినిమాలో తొలిసారి ధనుష్‌తో నయనతార జతకట్టింది. నయనతార తన కెరీర్ ప్రారంభంలో నటించిన సినిమా ఇది. ఈ సినిమా తెలుగులో వచ్చిన 'ఆడవారి మాటలకు అర్థాలు వేరులే' సినిమాకు రిమేక్. ఈ మూవీలో త్రిష పాత్రను తమిళంలో నయనతార పొషించింది. ఈ సినిమా విజయంతో నయనతార తమిళంలో ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.