Mahasakthi Teaser: నయనతార విశ్వరూపం.. 'మహాశక్తి' టీజర్ అదిరిపోయిందిగా!
వ్రాసిన వారు
Jayachandra Akuri
Sep 14, 2026
01:05 pm
ఈ వార్తాకథనం ఏంటి
నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 'మూకుత్తి అమ్మన్ 2' (Mookuthi Amman 2). ఈ సినిమాను తెలుగులో 'మహాశక్తి' పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సీనియర్ దర్శకుడు సుందర్.సి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నవంబర్ 6న 'మహాశక్తి' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం తాజాగా 'మహాశక్తి' టీజర్‌ను విడుదల చేసింది (Mahasakthi Teaser). టీజర్‌లో అమ్మవారి పాత్రలో కనిపించిన నయనతార గూస్‌బంప్స్ తెప్పించేలా ఆకట్టుకుంటున్నారు (Rise of Mahasakthi). ఈ సినిమాలో నయనతారతో పాటు సునీల్, రెజీనా, దునియా విజయ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.