నా జీవితానికి ఆధారం నువ్వే అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టిన నయనతార భర్త విఘ్నేష్ శివన్
ఈ వార్తాకథనం ఏంటి
దర్శకడు విఘ్నేష్ శివన్, హీరోయిన్ నయనతార 2022 జూన్ 9వ తేదీన వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఏడేళ్ళుగా ప్రేమించుకున్న వీరిద్దరూ, పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగు పెట్టారు.
పెళ్లయిన నాలుగు నెలల తర్వాత సరోగసీ ద్వారా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. ఈరోజు వీరి మొదటి వెడ్డింగ్ యానివర్సరీ.
ఈ సందర్భంగా తన భార్య నయనతారకు సోషల్ మీడియాలో పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు విఘ్నేష్ శివన్.
నా జీవితానికి ఆధారం నువ్వే అంటూ మొదలుపెట్టిన విఘ్నేష్, ఈ ఏడాది కాలంలో ఎన్నో అనుభవాలు ఎదురయ్యాయి, అనేక ఒడిదొడుకులు వచ్చాయి. ఊహించని మలుపులు, అనేక రకాల పరీక్షలు ఎదురయ్యాయి.
Details
కవల పిల్లల ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసిన విఘ్నేష్
అయితే ఎన్ని రకాల అనుభవాలు ఎదురైనా ఇంటికి వచ్చి ఫ్యామిలీని చూస్తే కలిగే ఆనందమే వేరు. కుటుంబం కొత్త ఎనర్జీనిస్తుంది.
మన పిల్లలు ఉయిర్, ఉలగమ్ లకు మంచి భవిష్యత్తును ఇచ్చేందుకు నేను ప్రయత్నిస్తాను అంటూ పోస్ట్ పెట్టాడు విఘ్నేష్.
అంతేకాదు, కవల పిల్లల్ని ఎత్తుకున్న నయనతార ఫోటోలు కూడా షేర్ చేశాడు. ప్రస్తుతం ఇంటర్నెట్లో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
నయనతార, విఘ్నేష్ శివన్ పెళ్లి చేసుకున్నప్పటి నుంచి వాళ్ళిద్దరి గురించి ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. ముఖ్యంగా సరోగసి విషయంలో అనేక పుకార్లు ప్రచారంలో తిరిగాయి.