NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / బాలయ్య సినిమాకు కొత్త అందం, అనిల్ రావిపూడి అదరగొట్టేస్తున్నడా?
    సినిమా

    బాలయ్య సినిమాకు కొత్త అందం, అనిల్ రావిపూడి అదరగొట్టేస్తున్నడా?

    బాలయ్య సినిమాకు కొత్త అందం, అనిల్ రావిపూడి అదరగొట్టేస్తున్నడా?
    వ్రాసిన వారు Sriram Pranateja
    Mar 21, 2023, 02:37 pm 0 నిమి చదవండి
    బాలయ్య సినిమాకు కొత్త అందం, అనిల్ రావిపూడి అదరగొట్టేస్తున్నడా?
    బాలయ్య సినిమాలో జాయిన్ అయిన కాజల్ అగర్వాల్

    నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా రూపొందుతున్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుండి సరికొత్త అప్డేట్ వచ్చింది. అభిమానులు అందరూ ఊగిపోయే అప్డేట్ తో ముందుకు వచ్చింది చిత్రబృందం. బాలయ్య 108వ సినిమాలో, కాజల్ అగర్వాల్ జాయిన్ అయ్యింది. ఈ మేరకు చిత్రబృందం ట్విట్టర్ వేదిక ద్వారా పోస్ట్ చేసింది. ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న సినిమా షూటింగ్ లో కాజల్ జాయిన్ అయ్యింది. ఈ సినిమాలో శ్రీలీల మరో ముఖ్య పాత్రలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్ బీ కే 108 సినిమా పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్సెస్ మరో రేంజ్ లో ఉండనున్నాయని తెలుస్తోంది.

    ముఖ్య ఆకర్షణగా నిలవనున్న థమన్

    అటు అనిల్ రావిపూడి తరహా కామెడీ తో పాటు బాలయ్య అభిమానులు ఆశించే యాక్షన్, ఈ సినిమాలో ఉంటుందట. ఇక థమన్ సంగీతం ఎలాగూ ఉంది కాబట్టి మరింత ప్రత్యేకంగా ఉంటుంది. బాలయ్య సినిమాకు వరుసగా మూడవసారి పని చేస్తున్నాడు థమన్. అంతకుముందు వచ్చిన అఖండ, వీరసింహారెడ్డి చిత్రాల్లోని నేపథ్య సంగీతానికి ఎంతలా పేరొచ్చిందో చెప్పాల్సిన పనిలేదు. ఎన్ బీ కే 108సినిమాలోనూ అదే మాదిరి నేపథ్యసంగీతం అభిమానులను ఉర్రూతలూగిస్తుందని అంటున్నారు. షైన్ స్క్రీన్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ బాధ్యతలు సి రామ్ ప్రసాద్ చూస్తున్నారు. ఎడిటింగ్ బాధ్యతలు తమ్మిరాజు స్వీకరించాడు. వి వెంకట్, యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.

    బాలయ్య సినిమా షూటింగ్ లో జాయిన్ అయిన కాజల్ అగర్వాల్

    @AnilRavipudi #nbk108 pic.twitter.com/w9z2wI9MPc

    — Kajal Aggarwal (@MsKajalAggarwal) March 20, 2023
    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తెలుగు సినిమా
    బాలకృష్ణ

    తెలుగు సినిమా

    ప్రాణాలతో ఆడుకోకండి, మరణంపై వచ్చిన ఫేక్ వార్తలపై కోటశ్రీనివాసరావు స్పందన తెలుగు చిత్ర పరిశ్రమ
    అఖిల్ ఏజెంట్ ని పాన్ ఇండియాలో పరిచయం చేయడానికి వస్తున్న ఆర్ఆర్ఆర్ హీరోలు? సినిమా
    రంగమార్తాండ ట్రైలర్: కట్టుకున్న ఇల్లు, కన్న కూతురు మనవి కావు ట్రైలర్ టాక్
    విరూపాక్ష సినిమా ప్రమోషన్లు షురూ, కథా ప్రపంచాన్ని పరిచయం చేస్తూ వీడియో రిలీజ్ సినిమా రిలీజ్

    బాలకృష్ణ

    బాలకృష్ణ 108: అనిల్ రావిపూడికి అప్పుడే వద్దని చెప్పిన బాలకృష్ణ తెలుగు సినిమా
    బాలయ్యకు జోడీగా మరోమారు ప్రగ్యా జైశ్వాల్ తెలుగు సినిమా
    అన్ స్టాపబుల్: హర్ట్ అయిన నర్సులు, సారీతో సర్దిచెప్పేసిన బాలకృష్ణ అన్ స్టాపబుల్
    అన్ స్టాపబుల్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్: రాజకీయ పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చిందన్న బాలకృష్ణ అన్ స్టాపబుల్

    సినిమా వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Entertainment Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023