ఆహా: తెలుగు ఇండియన్ ఐడల్ 2 వేదిక మీద బాలయ్య డాన్స్, మామూలుగా ఉండదు
ఈ వార్తాకథనం ఏంటి
బాలయ్య క్రేజ్ రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది. అన్ స్టాపబుల్ టాక్ షో ప్రోగ్రామ్ కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నప్పటి నుండి సోషల్ మీడియాలో బాలయ్య క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది.
ఆ క్రేజ్ ని సరిగ్గా వినియోగించుకోవడంలో ఆహా చాలా ముందుంటుంది. మరికొద్ది రోజుల్లో ఆహా ఫ్లాట్ ఫామ్ లో తెలుగు ఇండీయన్ ఐడల్ సీజన్ 2 మొదలు కాబోతుంది.
ఆల్రెడీ ఆడిషన్స్ పూర్తయిపోయాయి. ప్రారంభ కార్యక్రమాన్ని చాలా అట్టహాసంగా చేయడానికి బాలయ్యను అతిథిగా తీసుకొస్తున్నారు. అవును, ఈ గాలా విత్ బాలా పేరుతో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 మొదలు కాబోతుంది.
ఈ ప్రోగ్రామ్ లో బాలయ్య చాలా విభిన్నంగా కనిపించనున్నాడు. ఇంతకుముందెన్నడూ చూడని రీతిలో దర్శనం కాబోతున్నాడు.
ఆహా
డాన్స్ తో మైమరిపించేందుకు రెడీ
తెలుగు ఇండియన్ ఐడల్ వేదిక మీద తనదైన స్టెప్పులతో ప్రేక్షకులను అలరించనున్నాడు. ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్ నుండి చిన్నపాటి గ్లింప్స్ ని ఫోటోలను షేర్ చేసింది ఆహా టీమ్.
అందులో బాలకృష్ణ అవతారాన్ని చూసి అందరూ వావ్ అనకుండా ఉండలేకపోతున్నారు. డాన్స్ తో అలరిస్తున్న బాలయ్య ఫోటోలను షేర్ చేసిన ఆహా టీమ్, ఇంతకుముందెన్నడూ చూడని బాలయ్యను చూస్తారని ట్వీట్ చేసింది.
ఈ ప్రోగ్రామ్ మార్చ్ 17, 18తేదీల్లో స్ట్రీమింగ్ అవుతుందని కూడా తెలియజేసింది. అన్ స్టాపబుల్ సీజన్ 2 పూర్తయ్యాక, బాలయ్యను మిస్ అవుతున్న వాళ్ళందరికీ ఇదొక మంచి ఊరట అని చెప్పుకోవచ్చు.
అదలా ఉంచితే, బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.