Page Loader
NBK 109 : బాలకృష్ణ అభిమానులకు సూపర్ న్యూస్.. దీపావళికి 'ఎన్‌బీకే 109' టీజర్ రిలీజ్
బాలకృష్ణ అభిమానులకు సూపర్ న్యూస్.. దీపావళికి 'ఎన్‌బీకే 109' టీజర్ రిలీజ్

NBK 109 : బాలకృష్ణ అభిమానులకు సూపర్ న్యూస్.. దీపావళికి 'ఎన్‌బీకే 109' టీజర్ రిలీజ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 13, 2024
11:40 am

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'ఎన్‌బీకే 109'. గతేడాది వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ హిట్ అందించిన బాబీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం దసరా సందర్భంగా అభిమానులకు సాలిడ్ అప్‌డేట్‌ను అందించాయి.

Details

సంక్రాంతి కానుకగా విడుదల 

దీపావళి రోజున ఈ చిత్రంలోని టైటిల్, టీజర్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు పోస్టర్ ద్వారా తెలియజేశారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, కన్నడ నటుడు రిషి విలన్ పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్, ఊర్వశి రౌటేలా, ఫీమెల్ లీడ్ రోల్‌లో ఆమె పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. చాందినీ చౌదరి ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్