#NBK111: బాలయ్య #NBK111 గ్లింప్స్ రిలీజ్.. 91 సెకన్ల వీడియోతో సోషల్ మీడియా షేక్!
ఈ వార్తాకథనం ఏంటి
నందమూరి అభిమానులతో పాటు తెలుగు సినీప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న #NBK111 చిత్రం నుంచి క్రేజీ గ్లింప్స్ విడుదలైంది. నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో 111వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీకి సంబంధించిన 91 సెకన్ల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. విడుదలైన కొద్ది సేపటికే ఈ గ్లింప్స్ అభిమానులను ఆకట్టుకుంటూ వైరల్‌గా మారింది. గ్లింప్స్‌ను బట్టి చూస్తే దర్శకుడు గోపీచంద్ మలినేని మరోసారి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ముంబై మాఫియా నేపథ్యాన్ని ఎంచుకుని,హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు,స్టైలిష్ మేకోవర్,కొత్త తరహా బాడీ లాంగ్వేజ్‌తో బాలకృష్ణను సరికొత్తగా చూపించే ప్రయత్నం చేశారు. దీంతో ఈ సినిమా బాలయ్య అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లోనూ భారీఅంచనాలు పెంచుతోంది.
వివరాలు
#NBK111 గ్లింప్స్‌తో బాలకృష్ణ మరో మాస్ బ్లాక్‌బస్టర్‌కు సిద్ధం
ఈ గ్లింప్స్‌కు సంగీత దర్శకుడు ఎస్.ఎస్. థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రతి సన్నివేశాన్ని తన సంగీతంతో మరింత ఎలివేట్ చేస్తూ గ్లింప్స్‌కు అదనపు బలం చేకూర్చాడు. బాలకృష్ణ-థమన్ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకులకు థియేటర్లలో మాస్ ట్రీట్ ఇవ్వబోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో నటుడు మంచు మనోజ్ కీలక పాత్రలో కనిపించనుండటం విశేషం. అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా అందిస్తున్న పవర్‌ఫుల్ డైలాగ్స్ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. మొత్తం మీద #NBK111 గ్లింప్స్‌తో బాలకృష్ణ మరో మాస్ బ్లాక్‌బస్టర్‌కు సిద్ధమవుతున్నారనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
దర్శకుడు గోపీచంద్ మలినేని చేసిన ట్వీట్
This is ENTRY OF AN ERA...
— Gopichandh Malineni (@megopichand) June 10, 2026
Come let's celebrate our #NBK in his most stylish and menacing mode yet. https://t.co/dvEuSYOtVT#NBK111 @NBK111Movie pic.twitter.com/93EywBqlZ6