LOADING...
NBK : బాలయ్య డబుల్ ధమాకా.. రెండు భారీ ప్రాజెక్ట్స్ రిలీజ్ డేట్ ఫిక్స్!
బాలయ్య డబుల్ ధమాకా.. రెండు భారీ ప్రాజెక్ట్స్ రిలీజ్ డేట్ ఫిక్స్!

NBK : బాలయ్య డబుల్ ధమాకా.. రెండు భారీ ప్రాజెక్ట్స్ రిలీజ్ డేట్ ఫిక్స్!

వ్రాసిన వారు Moogati Shabari
Mar 22, 2026
01:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న NBK111 చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇటీవల ప్రారంభమైన ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ఈ ఏడాది దసరా సందర్భంగా విడుదల చేయాలని బాలకృష్ణ స్పష్టమైన డెడ్‌లైన్ పెట్టినట్టు తెలుస్తోంది. 'పెద్ది' సినిమాతో నిర్మాతగా పరిచయం అవుతున్న వెంకట సతీష్ కిలారు, వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, సంగీతాన్ని ఎస్.ఎస్. థమన్ అందిస్తున్నారు. ఇదిలా ఉండగా, తన 112వ సినిమాకు బాలకృష్ణ యువ దర్శకుడు వివేక్ ఆత్రేయకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆత్రేయ వినిపించిన కథ బాలయ్యకు నచ్చడంతో ఈ ఆసక్తికర కాంబినేషన్‌కు రూపం వచ్చింది.

వివరాలు

మాస్ ఇమేజ్ ఆయనకే సొంతం..

క్లాస్, డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలకు గుర్తింపు పొందిన వివేక్ ఆత్రేయ, మాస్ ఇమేజ్ ఉన్న బాలయ్యను ఎలా చూపిస్తారనే ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది. ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ వ్యయంతో నిర్మించనుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. NBK111 పూర్తయ్యాక, అంటే ఈ ఏడాది దసరా తర్వాత NBK112 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాను 2027 సమ్మర్‌కు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

వివరాలు

వేసవిలో అనౌన్స్..

ఈ ప్రాజెక్ట్ కోసం దిల్ రాజు, నాగవంశీ వంటి ప్రముఖ నిర్మాతలు పోటీ పడినా, చివరకు మైత్రీ మూవీ మేకర్స్ ఈ అవకాశాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన టెక్నీషియన్ల ఎంపిక జరుగుతోంది. ఈ భారీ ప్రాజెక్ట్‌ను అధికారికంగా వచ్చే వేసవిలో గ్రాండ్‌గా ప్రకటించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. బాలయ్య ఇమేజ్‌కు సరిపోయేలా వివేక్ ఆత్రేయ పవర్‌ఫుల్ కథను సిద్ధం చేశారని సమాచారం.

Advertisement