
నాగచైతన్య కొత్త సినిమాలో హీరోయిన్ ఫిక్స్, వీడియో రిలీజ్ చేసిన మేకర్స్
ఈ వార్తాకథనం ఏంటి
హీరో నాగ చైతన్య, దర్శకుడు చందు మొండేటి కాంబినేషన్లో ఇప్పటివరకు ప్రేమమ్, సవ్యసాచి అనే రెండు చిత్రాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు కూడా థియేటర్ల వద్ద పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయాయి.
ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కుతోంది. మత్స్యకారుల జీవితాల నేపథ్యంలో రూపొందే ఈ సినిమా నిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోందని సమాచారం.
ఈ సినిమాపై నాగచైతన్య చాలా వర్క్ చేస్తున్నాడు. మత్స్యకారులతో మాట్లాడుతూ, వాళ్ల జీవితాల గురించి తెలుసుకుంటున్నాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు కూడా బయటకు వచ్చాయి.
అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారనేది ఇప్పటివరకు బయటకు రాలేదు. తాజాగా ఈ విషయమై ఒక వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు.
Details
హీరోయిన్ గా సాయి పల్లవి?
ఈ వీడియోలో హీరో నాగచైతన్య, దర్శకుడు చందు మొండేటి, నిర్మాత అల్లు అరవింద్, బన్నీ వాసు కనిపించారు. అలాగే హీరోయిన్ కూడా కనిపించింది. కానీ ఆమె ఫేస్ ను రివీల్ చేయలేదు.
హీరోయిన్ ఫేస్ కనబడకపోయినా ఆమె సాయి పల్లవి అని స్పష్టంగా అర్థమవుతోంది. అంటే నాగచైతన్యతో సాయి పల్లవి మరోసారి కలిసి నటించబోతుందని తెలుస్తోంది.
ఇదివరకు వీరిద్దరూ కలిసి లవ్ స్టోరీ చిత్రంలో కనిపించారు. ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మరోసారి సరికొత్త కథాంశంతో వస్తున్నారు.
గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో రూపొందుతున్న ఈ సినిమా, పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కాబోతుందని సమాచారం.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
గీతా ఆర్ట్స్ రిలీజ్ చేసిన వీడియో
The widely adored and loved lady joins the voyage of #NC23 🌊⛵#ShejoinstheNC23Voyage
— Geetha Arts (@GeethaArts) September 19, 2023
Yuvasamrat @chay_akkineni @chandoomondeti #BunnyVas @GeethaArts #KarthikTheda pic.twitter.com/5Uusax4g4g