
శ్రీకాకుళంలో మత్యకారులను కలిసిన నాగచైతన్య: ఫోటోలు వైరల్
ఈ వార్తాకథనం ఏంటి
కస్టడీ సినిమాతో ఈ సంవత్సరం ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగ చైతన్య, విజయాన్ని అందుకోలేకపోయాడు. క్రితి శెట్టి హీరోయిన్ గా కనిపించిన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది.
ప్రస్తుతం నాగచైతన్య తన తర్వాతి సినిమా పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.
చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య నెక్స్ట్ సినిమా ఉండబోతుందని గతంలోనే వార్తలు వచ్చాయి. ఈ సినిమాకు బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరించానున్నారని అన్నారు.
అయితే తాజాగా నాగచైతన్య, చందూ మొండేటి, బన్నీ వాసు కలిసి శ్రీకాకుళం పయనమయ్యారు. అక్కడ మత్స్యకారులతో కలిసి ముచ్చటించారు.
ఆ ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి.
Details
మత్యకారుల జీవనశైలి తెలుసుకోవడం కోసమే
ఈ సినిమాలో నాగచైతన్య మత్స్యకార యువకుడిగా కనిపించనున్నాడని సమాచారం. అందువల్లే మత్స్యకార యువకులు ఎలా ఉంటారో, ఏ విధంగా ఆలోచిస్తారో, వారి జీవనశైలి ఎలాంటిదో తెలుసుకోవడం కోసమే శ్రీకాకుళంలో మత్స్యకారులతో ముచ్చటించారని చెబుతున్నారు.
గతంలో చందూ మొండేటి దర్శకత్వంలో ప్రేమమ్, సవ్యసాచి చిత్రాలు చేసాడు నాగచైతన్య. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో మూడవ సినిమా రూపొందుతోంది.
బంగార్రాజు తర్వాత నాగచైతన్యకు సరైన హిట్ దొరకలేదు. థాంక్యూ, కస్టడీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం చెందడంతో ఇప్పుడు కచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మరి ఈసారైనా నాగ చైతన్య హిట్ కొడతాడా లేదా అనేది చూడాలి.