Telusu Kada OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న జొన్నలగడ్డ లేటెస్ట్ మూవీ 'తెలుసు కదా'.. స్ట్రీమింగ్ ఎప్పటినుండి అంటే?
ఈ వార్తాకథనం ఏంటి
స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం "తెలుసు కదా". యూత్‌ఫుల్ అండ్ ఎమోషనల్ కథతో రూపొందిన ఈ సినిమాను ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన దర్శకత్వం వహించారు. ఇందులో రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా కనిపించారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 17న విడుదలైన ఈ చిత్రం, రిలీజ్‌కు ముందే టీజర్, పాటలు, ట్రైలర్‌ల ద్వారా మంచి హైప్ క్రియేట్ చేసింది. అయితే, విడుదల తర్వాత సినిమా అంచనాల మేరకు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. (Telusu Kada OTT) ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కొంతమంది ప్రేక్షకులు సినిమాలోని భావోద్వేగ సన్నివేశాలకు బాగా కనెక్ట్ అయ్యారు, మరికొందరికి మాత్రం కథ సాధారణంగా, రొటీన్‌గా అనిపించింది.
వివరాలు
నవంబర్ 13 నుంచి ఈ సినిమా ఓటీటీలో అందుబాటులోకి..
దీని ఫలితంగా, "తెలుసు కదా" ఆశించిన స్థాయి విజయాన్ని సాధించలేకపోయింది. దీంతో, సినిమా థియేటర్లలో మిస్సైన ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీలో చూసేందుకు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో, చిత్ర బృందం ఇటీవలే ఓటీటీ రిలీజ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ పొందిన విషయం తెలిసిందే. నవంబర్ 13 నుంచి ఈ సినిమా ఓటీటీలో అందుబాటులోకి రానుందని మేకర్స్ ప్రకటించారు. దక్షిణ భారత భాషలన్నింట్లోను సినిమా స్ట్రీమ్ కానుంది. థియేటర్లలో మిశ్రమ స్పందన పొందిన ఈ చిత్రానికి, ఓటీటీలో ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో చూడాలి.