అన్ స్టాపబుల్: బాలయ్య షోకి నెట్ ఫ్లిక్స్ భారీ ఆఫర్?
ఓటీటీల్లో అతిపెద్ద ఫ్లాట్ ఫామ్ గా చెప్పుకునే నెట్ ఫ్లిక్ల్, ప్రస్తుతం తెలుగు సినిమాల మీద, సిరీస్ ల మీద గట్టి ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. గతంతో పోలిస్తే ఈ మధ్య నెట్ ఫ్లిక్స్ లో తెలుగు సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. నెట్ ఫ్లిక్స్, తన తెలుగు విభాగానికి మరింత వినోదం చేర్చడానికి సిద్ధం అవుతోందని సమాచారం. ఇప్పటికే ఆహాలో రిలీజ్ అవుతున్న కొన్ని సినిమాలు నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి వస్తున్నాయి. కొన్ని సినిమాలను నెట్ ఫ్లిక్స్ తో పాటు షేర్ చేసుకుంది ఆహా. ప్రస్తుతం బాలయ్య వ్యాఖ్యతగా ప్రసారం అవుతున్న అన్ స్టాపబుల్ ని తన ఫ్లాట్ ఫామ్ కి తీసుకురావడానికి నెట్ ఫ్లిక్స్ ప్రయత్నాలు జరుపుతున్నట్లు వినిపిస్తోంది.
అన్ స్టాబుల్ షో కోసం నెట్ ఫ్లిక్స్ ప్రయత్నాలు
ఆహాలో వచ్చే అన్ స్టాపబుల్ షో ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలయ్య పంచులతో అన్ స్టాపబుల్ గా దుమ్ము దులుపుతోంది. అన్ స్టాపబుల్ షోని నెట్ ఫ్లిక్స్ కావాలనుకుంటున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇప్పటివరకు ఈ షో ఒక్క ఆహాలో తప్పా మరెక్కడా రిలీజ్ అవ్వడం లేదు. కానీ నెట్ ఫ్లిక్స్ మాత్రం పట్టుబడుతున్నట్లు, దానికోసం పెద్ద మొత్తంలో ఆఫర్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. మరి అల్లు అరవింద్, అన్ స్టాపబుల్ షో ప్రసారంలో నెట్ ఫ్లిక్స్ కి కూడా భాగస్వామ్యం ఇస్తారా లేదా చూడాలి. ప్రస్తుతం అన్ స్టాపబుల్ లో ప్రభాస్ ఎపిసోడ్ రచ్చ లేపుతోంది. ఎపిసోడ్ రిలీజైన సమయంలో సర్వర్ క్రాష్ అయ్యేంత ట్రాఫిక్ వచ్చింది.