
Puri Jagannadh: పూరి జగన్నాథ్‌ను అవమానించిన నెటిజన్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నటుడు!
ఈ వార్తాకథనం ఏంటి
తమిళ స్టార్ విజయ్ సేతుపతి హీరోగా ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ఓ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఉగాది సందర్భంగా ఈ సినిమాపై అధికారిక ప్రకటన విడుదలైంది.
అయితే ఈ ప్రాజెక్ట్‌పై తాజాగా ఓ నెటిజన్ కామెంట్ చేయగా, నటుడు శాంతను భాగ్యరాజ్ దానికి కౌంటర్ ఇచ్చారు.
పూరి జగన్నాథ్ అవుట్‌డేటెడ్ అయ్యారంటూ, విజయ్ సేతుపతి 'మహారాజ' వంటి భారీ విజయానంతరం ఆయన దర్శకత్వంలో సినిమా చేయడం ఏంటి అంటూ ఓ నెటిజన్ విమర్శించారు.
ఈ వ్యాఖ్యలపై నటుడు శాంతను భాగ్యరాజ్ తీవ్రంగా స్పందించారు. ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖుల గురించి అలా మాట్లాడకూడదని, సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ముందు సరైన పదాలను వాడడం నేర్చుకోవాలని సూచించారు.
Details
పరిశీలనలో 'బెగ్గర్' టైటిల్
పూరి జగన్నాథ్ లాంటి గొప్ప దర్శకుడిని గౌరవించాలన్నారు. మీలాంటి వారినుంచి ఇలాంటి వ్యాఖ్యలు ఊహించలేదని ఖండించారు. దీంతో ఆ నెటిజన్ క్షమాపణలు చెబుతూ తన పోస్ట్‌ను డిలీట్ చేశారు.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'లైగర్', 'డబుల్ ఇస్మార్ట్' సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి.
ఈ క్రమంలో విజయ్ సేతుపతిని హీరోగా తీసుకుని ఓ సినిమాను రూపొందిస్తున్నారని వార్తలు వచ్చాయి. ఉగాది రోజున నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించింది.
ఈ సినిమాకి 'బెగ్గర్' అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఇక విజయ్ సేతుపతి ఇటీవల విడుదలైన 'మహారాజ' చిత్రంతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.