
Prakash Raj: పాక్ నటుడికి మద్దతు.. ప్రకాశ్ రాజ్‌పై నెటిజన్ల ఆగ్రహం!
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో ఇటీవల చోటుచేసుకున్న ఉగ్రదాడి దేశవ్యాప్తంగా ఆగ్రహానికి కారణమైంది.
ఈ దాడి వెనక పాకిస్తాన్ ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు నిర్ధారణ కావడంతో కేంద్ర ప్రభుత్వం వారి పై తగిన ప్రతీకారం తీసుకోవాలని తీవ్రంగా ఆలోచిస్తోంది.
దాడికి పాల్పడిన వారికి తగిన శిక్ష పడేలా సైన్యంతో కలిసి చర్యలు తీసుకోవడం తమ బాధ్యత అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇటీవల వ్యాఖ్యానించారు.
దీంతో పాకిస్థాన్‌కు భారత్ నుంచి గట్టి గుణపాఠం తగలబోతోందని చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పహల్గాం దాడిపై పాకిస్తాన్‌కు అన్ని రంగాల్లో భారత ప్రభుత్వం కఠినంగా ప్రతిస్పందించింది.
Details
అబిర్ గులాల్ ఇండియాలో విడుదల చేయకపోవడాన్ని తప్పుబట్టిన ప్రకాశ్ రాజ్
ద్వైపాక్షిక సంబంధాలను గణనీయంగా తగ్గిస్తూ, ఎగుమతులు, దిగుమతులను నిలిపివేసింది. పాక్‌కు జలవనరుల పంపిణీని కూడా ఆపేసింది.
అదేవిధంగా టీవీ ఛానెళ్లు, సోషల్ మీడియా వేదికలు, సినిమాలపై నిషేధం విధించింది. పాకిస్తానీయులను దేశం నుండి పంపించాలన్న ఆదేశాలు కూడా జారీ చేసింది.
పాక్ నటులు నటించిన సినిమాల విడుదలను భారతదేశంలో నిషేధించడమూ ఇందుకు భాగం. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
సాధారణంగా బీజేపీపై విమర్శలు చేసే ఆయన, ఈ సందర్భంలో పాకిస్థాన్ నటులకు మద్దతు ఇచ్చారు.
ఫవాద్ ఖాన్ నటించిన అబిర్ గులాల్ అనే పాక్ సినిమాను ఇండియాలో విడుదల చేయకుండా ఆపిన నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు.
Details
స్వీట్ వార్నింగ్ ఇచ్చిన ప్రకాశ్ రాజ్
ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ పోర్నోగ్రఫీ కాకుండా మరే సినిమా అయినా ఇలా నిషేధించడం నాకెందుకో సరిగా అనిపించడం లేదు.
సినిమా రిలీజ్ అయిన తర్వాతే ప్రేక్షకులు చూడాలనుకుంటారో లేదో అర్థమవుతుంది. ఆ నిర్ణయాన్ని వారికే వదిలేయాలని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
అయితే, పహల్గాం దాడిని ఖండిస్తూ ప్రకాశ్ రాజ్ ఒక దీర్ఘంగా నోట్ కూడా విడుదల చేశారు. ఇలాంటి పనులు మా దేశం చేయదు. మా పౌరులు కూడా ఈ స్థాయిలో దిగజారరు.
మా మంచితనాన్ని చేతగానితనంగా అర్థం చేసుకోవద్దు అంటూ పాకిస్తాన్‌ను హెచ్చరిస్తూ 'స్వీట్ వార్నింగ్' ఇచ్చారు.