LOADING...
Upcoming Movies Telugu: ఈవారం థియేటర్లలో కొత్త సినిమాలు.. ఓటీటీలోనూ స్పెషల్ ఎంటర్‌టైన్‌మెంట్‌! 
ఈవారం థియేటర్లలో కొత్త సినిమాలు.. ఓటీటీలోనూ స్పెషల్ ఎంటర్‌టైన్‌మెంట్‌!

Upcoming Movies Telugu: ఈవారం థియేటర్లలో కొత్త సినిమాలు.. ఓటీటీలోనూ స్పెషల్ ఎంటర్‌టైన్‌మెంట్‌! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 18, 2025
01:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈవారం మూవీ లవర్స్‌కు ప్రత్యేక అనుభూతిని లభించనుంది. ఎందుకంటే ఈ వారం థియేటర్లు, ఓటిటిలోనూ స్పెషల్ మూవీలు రానున్నాయి. అయితే ఏ మూవీలో వస్తాయో ఓసారి పరిశీలిద్దాం. మహిళా ప్రాధాన్య కథతో 'పరదా' అనుపమ పరమేశ్వరన్‌ ప్రధాన పాత్రలో, ప్రవీణ్‌ కండ్రేగుల దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'పరదా'. ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్‌ డొంకాడ, శ్రీనివాసులు పీవీ, శ్రీధర్‌ మక్కువ నిర్మించిన ఈ సినిమాలో దర్శన రాజేంద్రన్, సంగీత కీలక పాత్రల్లో నటించారు. 'ఇది బలమైన కథతో కూడిన కమర్షియల్‌ సినిమా. అనుపమను కొత్త కోణంలో చూపించబోతున్నామని చిత్ర బృందం తెలిపింది.

Details

పేపర్‌ లీక్‌ అణుబాంబు కంటే ప్రమాదకరం

సామాజిక సమస్యలను ఎప్పుడూ తన చిత్రాల ద్వారా ప్రతిబింబించే దర్శక-నటుడు ఆర్‌. నారాయణమూర్తి తెరకెక్కించిన తాజా చిత్రం 'యూనివర్సిటీ పేపర్‌ లీక్‌'. స్వీయ దర్శకత్వం, నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 22న విడుదల కానుంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయి, ట్రివిక్రమ్‌ సహా పలువురు సినీ, విద్యావేత్తలు ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఎక్కడా రాజీపడకుండా నిజాయితీగా చిత్రాన్ని రూపొందించారని అభినందించారు. ' ఈ సినిమాను యువత తప్పకుండా చూడాలని నారాయణమూర్తి అన్నారు.

Details

చిరంజీవి పుట్టినరోజు కానుకగా 'స్టాలిన్‌' రీ-రిలీజ్‌

ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో, చిరంజీవి కీలక పాత్రలో రూపొందిన చిత్రం 'స్టాలిన్‌' మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. త్రిష కథానాయికగా నటించగా, ఖుష్బూ, ప్రకాశ్‌రాజ్‌ ముఖ్య పాత్రల్లో కనిపించారు. నాగబాబు నిర్మించిన ఈ సినిమా, వినోదంతో పాటు సమాజంపై బాధ్యతను గుర్తు చేస్తుంది. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా, ఆగస్టు 22న ఈ మూవీని రీ-రిలీజ్‌ చేస్తున్నారు.

Details

 ఈ వారం ఓటీటీ రిలీజ్‌లు ఇవే

నెట్‌ఫ్లిక్స్‌ రివర్స్‌ ఆఫ్ ఫేట్‌ (వెబ్‌సిరీస్‌) - ఆగస్టు 20 హోస్టేజ్‌ (వెబ్‌సిరీస్‌) - ఆగస్టు 21 అమెజాన్‌ ప్రైమ్‌ రోడ్‌ఆన్‌ ఏ మిలియన్‌ సీజన్‌ 2 (వెబ్‌సిరీస్‌) - ఆగస్టు 22 జియో హాట్‌స్టార్‌ పీస్‌ మేకర్‌ సీజన్‌ 2 (వెబ్‌సిరీస్‌) - ఆగస్టు 21 ఆహా కొత్తపల్లిలో ఒకప్పుడు (తెలుగు సినిమా) - ఆగస్టు 22 యాపిల్‌ టీవీ ఇన్‌వేషన్‌: సీజన్‌ 3 (వెబ్‌సిరీస్‌) - ఆగస్టు 22