Page Loader
Pushpa 2: 'పుష్ప ది రూల్‌' కౌంట్‌డౌన్‌ షురూ .. కొత్త పోస్టర్‌ షేర్‌ చేసిన టీమ్‌
పుష్ప ది రూల్‌' కౌంట్‌డౌన్‌ షురూ .. కొత్త పోస్టర్‌ షేర్‌ చేసిన టీమ్‌

Pushpa 2: 'పుష్ప ది రూల్‌' కౌంట్‌డౌన్‌ షురూ .. కొత్త పోస్టర్‌ షేర్‌ చేసిన టీమ్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 28, 2024
04:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

అల్లు అర్జున్‌ , సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ "పుష్ప 2: ది రూల్". ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సంబంధించిన కౌంట్‌డౌన్‌ మొదలైపోయింది. మరో 100 రోజుల్లో, అంటే డిసెంబర్‌ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం ఒక కొత్త పోస్టర్‌ విడుదల చేసింది. ''మరో వంద రోజుల్లో అతడి రూల్‌ చూడనున్నారు. అద్భుతమైన అనుభూతి కోసం సిద్ధంగా ఉండండి'' అని టీమ్ తెలిపింది. దీనిపై అభిమానులు ఉత్సాహంగా స్పందిస్తూ, ''వెయిటింగ్‌'' అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

వివరాలు 

 యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతున్న పాటలు 

సుకుమార్‌ "పుష్ప 2" మొదటి భాగం కంటే అద్భుతంగా ఉండనుందని తెలిపారు.మొదటి భాగంలో అనేక ప్రశ్నలకు సమాధానాలు లేకపోవడంతో, ఈ రెండో భాగంలో వాటికి సమాధానాలు ఇవ్వనున్నారు. ముఖ్యంగా పుష్పరాజ్‌ సిండికేట్‌తో ఆడే గేమ్‌,ఎమోషనల్‌ సీన్స్‌,అలాగే పుష్పరాజ్‌ vs భన్వర్‌సింగ్‌ షెకావత్‌ మధ్య నడిచే డ్రామా ప్రేక్షకులను మరింత ఆకట్టుకోనుంది. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరపరిచిన పాటలు ఇప్పటికే యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతున్నాయి. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుండగా,ఫహద్‌ ఫాజిల్‌,సునీల్‌, అనసూయ, జగదీశ్‌ ప్రతాప్‌, ధనుంజయ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబరు 6న "పుష్ప 2: ది రూల్‌" పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మేకర్స్ చేసిన ట్వీట్