
Mr Bachchan : "మిస్టర్ బచ్చన్" నుండి కొత్త పోస్టర్ ను లాంచ్ చేసిన మేకర్స్
ఈ వార్తాకథనం ఏంటి
మాస్ మహారాజా రవితేజ,డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో మిస్టర్ బచ్చన్ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే అనే బాలీవుడ్ భామ హీరోయిన్'గా నటిస్తుండగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో తెరకెక్కుతోంది.
వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ మూవీ నుండి మేకర్స్ సరికొత్త పోస్టర్ ను విడుదల చేసారు.
ఈ పోస్టర్ లో హీరో రవితేజ, హీరోయిన్ భాగ్యశ్రీ లను చూడచ్చు.
రవితేజ కుర్చీ లో కూర్చుంటే.., రవితేజ పై హీరోయిన్ వాలిపోయి ఉంది. ఈ రొమాంటిక్ పోస్టర్ ఆడియెన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది.
Details
మరో రీమేక్ హిట్ రేసులో డైైరెక్టర్ హరీష్ శంకర్
ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ మ్యూజిక్ డైరెక్టర్.
గతంలో హరీష్ శంకర్ తీసిన గబ్బర్ సింగ్, గద్దలకొండ గణేష్ సినిమాలు రీమేక్ మూవీలే కావడంతో తాజాగా అంచానలు భారీగా ఏర్పడ్డాయి.
తాజాగా మాస్ మహారాజ రవితేజతో మరో రీమేక్ తీసి హిట్ కొట్టేందుకు డైరెక్టర్ ఉవ్విళ్లూరుతున్నాడు.
ఈ చిత్రం కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చేసిన ట్వీట్
The massiest of men have the softest of hearts ❤️
— People Media Factory (@peoplemediafcy) February 14, 2024
Team #MrBachchan wishes you all a very Happy Valentine's Day ❤️#MassReunion
Mass Maharaaj @RaviTeja_offl @harish2you @vishwaprasadtg @peoplemediafcy @TSeries @PanoramaMovies @vivekkuchibotla @KumarMangat #BhushanKumar… pic.twitter.com/j49tlqwryI