Mana Shankaravaraprasad: అడ్వాన్స్ బుకింగ్స్‌లో సరికొత్త రికార్డులు.. బాక్సాఫీస్‌పై 'మన శంకరవరప్రసాద్ గారు' ప్రభంజనం
ఈ వార్తాకథనం ఏంటి
సంక్రాంతి సినిమా.. అందులోనూ మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్.. మధ్యలో గెస్ట్‌గా వస్తున్న విక్టరీ వెంకటేశ్.. ఇంకేం పండగంతా థియేటర్లలోనే ఉండబోతోంది. మన శంకరవరప్రసాద్ గారు మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవగానే రికార్డులు క్రియేట్ చేస్తోంది. రాజా సాబ్‌కు వచ్చిన మిక్స్‌డ్ రివ్యూలు కూడా చిరుకి కలిసి వస్తున్నట్లుగా ఉంది.
Details
మన శంకరవరప్రసాద్ గారు అడ్వాన్స్ బుకింగ్స్
చిరంజీవి, నయనతార, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న మన శంకరవరప్రసాద్ గారు మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ లో దుమ్ము రేపుతోంది. తొలి 24 గంటల్లోనే బుక్ మై షోలో ఏకంగా లక్షా 8 వేలకుపైగా టికెట్లు అమ్ముడు పోవడం విశేషం. ప్రస్తుతం ఈ పోర్టల్ లో మూవీ ట్రెండింగ్ లో ఉంది. సుమారు 2.84 లక్షల మంది మూవీపై ఇంట్రెస్ట్ చూపించారు. ఇప్పుడు కూడా గంటకు సగటును 11 వేల టికెట్లు అమ్ముడవుతుండటం విశేషం. ఈ సినిమాను ఫ్యామిలీ, థ్రిల్లర్ గా బుక్ మై షో చూపించింది. 2 గంటల 44 నిమిషాల భారీ రన్‌టైమ్ తో వస్తోంది.
Details
మన శంకరవరప్రసాద్ గారుపై భారీ అంచనాలు
గతేడాది సంక్రాంతికి 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో అనిల్ రావిపూడి చేసిన మ్యాజిక్ చూశాం కదా. దీంతో మన శంకరవరప్రసాద్ గారుపై మొదటి నుంచే అంచనాలు భారీగా ఉన్నాయి. చిరంజీవి, నయనతార, అతిథిపాత్రలో వెంకటేశ్ అనే పాయింట్ ఒకటి కాగా.. అనిల్ మార్క్ కామెడీ మరో పాయింట్. ఇక ప్రభాస్ ది రాజా సాబ్ చాలా వరకు నిరాశ పరిచిన నేపథ్యంలోనూ ఈ సినిమాపై జనాల ఆసక్తి పెరిగింది. ఈ పండగపూట మంచి నవ్వులు పంచే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మన శంకరవరప్రసాద్ గారే అని ప్రేక్షకులు నమ్ముతున్నట్లు ఈ అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ చూస్తే తెలుస్తోంది.
Details
జనవరి 12న రిలీజ్
సినిమా కంటే తన ప్రమోషన్లతోనే ఎక్కువగా ఆకట్టుకునే అనిల్ రావిపూడి ఈ సినిమా విషయంలోనూ అదే చేశాడు. మూవీ టీమ్ నుంచి వచ్చిన కంటెంట్ మొత్తం బాగా ఆకట్టుకుంది. లేటెస్ట్ రిలీజ్ చేసిన చిరంజీవి హుక్ స్టెప్ తో అభిమానుల ఆశలు రెట్టింపయ్యాయి. వింటేజ్ చిరుని చూడబోతున్నట్లుగా దీనితోనే తేలిపోయింది. మన శంకరవరప్రసాద్ గారు మూవీ సోమవారం (జనవరి 12) థియేటర్లలోకి అడుగుపెట్టబోతోంది. ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ టికెట్ల ధరలు పెరిగిన విషయం తెలిసిందే.