కొత్త సినిమా: పల్లెటూరి జీవితాన్ని ఆవిష్కరించే ఏందిరా ఈ పంచాయితీ
ఈ వార్తాకథనం ఏంటి
ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్ మొత్తం మారిపోయింది. ఇంతకుముందులా ఫార్ములా కథలు పనిచేయడం లేదు. జనాలు కూడా సినిమా చూసే పద్దతిని బాగా మార్చుకున్నారు.
ఒకప్పుడు తమ జీవితాల్లో లేనిదాన్ని తెరమీద చూడడానికి ఇష్టపడేవారు. డబ్బులేక ఇబ్బంది పడేవారు వాడు డబ్బున్నవాడుగా ఎదిగే హీరోని చూసే ఇష్టపడేవారు.
కానీ ఇప్పుడలా లేదు. తమ జీవితాల్లోంచి వచ్చే కథలను ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. తాము తమ జీవితంలో ఎదుర్కునే సమస్యలు, సంతోషాలను తెర మీద హీరో ఎదుర్కొంటుంటే, చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
అందుకే ఎక్కువ శాతం కథలు పల్లెటూరుకు సంబంధించినవి ఉంటున్నాయి. అలా వస్తున్న మరో చిత్రమే ఏందిరా ఈ పంచాయితీ. తాజాగా ఈ చిత్రం నుండి టైటిల్ పోస్టర్ రిలీజైంది.
ఏందిరా ఈ పంచాయితీ
కొత్తగా పరిచయం కాబోతున్న హీరో హీరోయిన్లు
టైటిల్ చాలా కొత్తగా ఉంది. ఈజీగా అందరికీ నచ్చేసేలా ఉంది. టైటిల్ పోస్టర్ లో కనిపిస్తున్న దాని ప్రకారం, ఈ సినిమా మంచి ఎంటర్ టైనర్ గా ఉండనుందని అర్థమవుతోంది.
భరత, విషికా హీరోహీరోయిన్లుగా పరిచయం కాబోతున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో కాశీ విశ్వనాథ్, తోటపల్లి మధు, రవి వర్మ, ప్రేమ్ సాగర్, సమీర్, చిత్తూరు కుర్రాడు తేజ నటిస్తున్నారు.
ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాకు పెద్దపల్లి రోహిత్ సంగీతం అందిస్తున్నారు. మాటలు వెంకట్ పాల్వాయి, ప్రియాంకా ఎరుకల అందించారు.
మరి ఈ సినిమా కూడా అచ్చమైన గ్రామీణ సంస్కృతిని పరిచయం చేస్తూ అందరికీ ఆహ్లాదాన్ని పంచుతుందో లేదో చూడాలి.