ప్రకటించిన సినిమాలను ఆపేసి వేరే సినిమాలను లైన్లోకి తీసుకువచ్చిన హీరోలు, దర్శకులు
ఈ వార్తాకథనం ఏంటి
సినిమా ఇండస్ట్రీలో కాంబినేషన్ల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. హీరోలు, దర్శకులు, హీరోయిన్ల కాంబినేషన్ల కోసం నిర్మాతలు ఎగబడుతుంటారు. అయితే అలాంటి క్రేజీ కాంబినేషన్స్ సెట్ అయ్యాక మళ్ళీ విడిపోతే జనాల్లో ఒకరకమైన నీరసం వచ్చేస్తుంది.
అలా సెట్ అయిన కాంబినేషన్లు విడిపోయి, విడిగా వేరే సినిమాలను మొదలెడతారు. అలాంటి కాంబినేషన్ ల గురించీ, విడిపోయిన వారి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.
ఐకాన్:
అల్లు అర్జున్, వేణు శ్రీరామ్, దిల్ రాజు కాంబినేషన్లో రూపొందాల్సిన మూవీ, అడ్రెస్ లేకుండా పోయింది. అసలు ఈ సినిమా ఉంటుందా ఉండదా అన్నది ఇప్పటికీ సందేహమే.
ఇక అల్లు అర్జున్, తన పుష్ప తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో సినిమా మొదలు పెట్టబోతున్నాడు.
తెలుగు సినిమా
ప్రచారం జోరుగా సాగినా ముందుకు కదల్లేని కాంబినేషన్లు
ఎన్టీఆర్, బుచ్చిబాబు కాంబినేషన్:
ఉప్పెనతో మంచి మార్కులు కొట్టేసిన బుచ్చిబాబు సానా, ఎన్టీఆర్ తో సినిమా తీయబోతున్నాడని ప్రచారం జరిగింది. కానీ ఏమైందో తెలియదు, సడెన్ గా రామ్ చరణ్ తో సినిమాను ఓకే చేసుకున్నాడు. ఈ విషయమై అధికారికంగా ప్రకటన కూడా వచ్చింది.
రామ్ చరణ్, గౌతమ్ తిన్ననూరి:
మళ్ళీరావా, జెర్సీ వంటి చిత్రాల దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, రామ్ చరణ్ ని డైరెక్ట్ చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. శంకర్ తో మూవీ తర్వాత గౌతమ్ దర్శకత్వంలో రామ్ చరణ్ చేస్తాడని అన్నారు. కానీ విజయ్ దేవరకొండ తో సినిమా చేస్తున్నట్లు ప్రకటన ఇచ్చాడు గౌతమ్.
విజయ్ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో సినిమా ఉంటుందని అన్నారు కానీ అది కుదరలేదు.