
అవకాశం వస్తే కోహ్లీ బయోపిక్ లో నటిస్తానంటున్న రామ్ చరణ్
ఈ వార్తాకథనం ఏంటి
అస్కార్ అవార్డ్ వేడుకలకు అమెరికా వెళ్ళిన ఆర్ఆర్ఆర్ టీమ్, ఒక్కొక్కరుగా ఇండియాకు తిరిగి వస్తున్నారు. ఆర్ఆర్ఆర్ టీమ్ కోసం ఎయిర్ పోర్టుల్లో అభిమానులు అందరూ ఎదురూచూసారు.
అమెరికా నుండి నిన్న మధ్యాహ్నం ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో దిగారు రామ్ చరణ్. దిగీ దిగగానే అటు అభిమానులతో పాటు మీడియా కూడా రామ్ చరణ్ కోసం పరుగులు పెట్టింది.
అయితే ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రామ్ చరణ్, మీడియాతో మాట్లాడుతూ, భవిష్యత్తులో క్రీడా నేపథ్యమున్న సినిమా చేయాలనుందనీ, ఎప్పటి నుండో అలాంటి కథ కోసం చూస్తున్నానని అన్నాడు.
దాంతో, క్రికెటర్ విరాట్ కోహ్లీ బయోపిక్ లో నటిస్తారా అని అడగడంతో, అవకాశం వస్తే తప్పకుండా నటిస్తాననీ అన్నాడు రామ్ చరణ్.
రామ్ చరణ్
పోలికలు కూడా సేమ్ ఉన్నాయన్న రామ్ చరణ్
కోహ్లీ బయోపిక్ లో నటిస్తానని చెప్పిన రామ్ చరణ్, పోలికలు కూడ సరిపోతాయనీ, చూడడానికి తాను కొంచెం కోహ్లీలా కనిపిస్తానని అన్నాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్, ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.
అటు రామ్ చరణ్ అభిమానుల్లోనూ, ఇటు విరాట్ కోహ్లీ అభిమానుల్లోనూ ఉత్సాహం ఉప్పొంగుతోంది. రామ్ చరణ్ అన్న మాట్లు నిజమైతే బాగుండునని అందరూ అనుకుంటున్నారు.
మరి దర్శకులు ఇటువైపుగా ఆలోచిస్తారేమో చూడాలి. అదలా ఉంచితే, రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాకు సీఈవో (ఛీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ - ప్రధాన ఎన్నికల అధికారి) అనే టైటిల్ ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు.