LOADING...
Jayam Ravi : విడాకుల కేసులో కొత్త మలుపు.. రూ.40 లక్షలు భరణం కోరిన జయం రవి భార్య
విడాకుల కేసులో కొత్త మలుపు.. రూ.40 లక్షలు భరణం కోరిన జయం రవి భార్య

Jayam Ravi : విడాకుల కేసులో కొత్త మలుపు.. రూ.40 లక్షలు భరణం కోరిన జయం రవి భార్య

వ్రాసిన వారు Jayachandra Akuri
May 21, 2025
04:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

జయం రవి, ఆయన భార్య ఆర్తి విడాకుల వివాదం కొత్త మలుపు తిరిగింది. చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టులో హాజరైన ఈ దంపతుల కేసును కోర్టు పరిశీలించింది. రాజీ కోసం కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని న్యాయమూర్తి సూచించారు. అయితే జయం రవి తన భార్యతో కలిసి జీవించలేనని తేల్చేసినట్టు సమాచారం. విడాకులు మంజూరు చేయాలని రవికి చెందిన లీగల్ టీమ్ కోర్టును కోరింది. ఈ నేపథ్యంలో భర్త నుంచి విడాకులు కోరుతున్న జయం రవి తనకు నెలకు రూ.40 లక్షల భరణం ఇవ్వాలని ఆర్తి పిటిషన్ వేశారు.

Details

తదుపరి విచారణ జూన్ 12కి వాయిదా

దీనిపై కోర్టు తదుపరి విచారణను జూన్ 12కి వాయిదా వేసింది. గత ఏడాదే జయం రవి తాను భార్య ఆర్తితో విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. అయితే తన అనుమతి లేకుండా ఈ విషయం బయటకు వచ్చిందంటూ ఆర్తి మండిపడ్డారు. గాయని కెనీషాతో రవికి సన్నిహిత సంబంధాలున్నాయన్న కోలీవుడ్ వర్గాల కథనాలు బయటకొచ్చాయి. ఇటీవల ఓ వేడుకకు రవి, కెనీషా కలిసి హాజరుకావడం చర్చనీయాంశమైంది. ఇది ఇలా ఉండగా, ఆర్తి తన బాధను సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరిచారు. 18 ఏళ్లపాటు తనతో జీవించిన వ్యక్తి ఇప్పుడు బాధ్యత మరిచాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లల కోసమే ఈ పోరాటమని పేర్కొన్నారు.

Details

తాము విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం

ఆర్తి కామెంట్లపై స్పందించిన జయం రవి, ఆమె తనను నైతికంగా, ఆర్థికంగా నియంత్రించిందంటూ ఓ నోట్ రిలీజ్ చేశారు. మంగళవారం మరో పోస్టు చేసిన ఆర్తి - తాము వేరు కావడానికి మూడో వ్యక్తే కారణమని తెలిపారు. తగిన ఆధారాలున్నాయని, ఇకపై విషయాలు కోర్టులోనే చర్చిస్తానని స్పష్టం చేశారు. ఈ కేసు చుట్టూ కోలీవుడ్‌లో పెద్ద చర్చ సాగుతోంది. జూన్ 12న జరిగే తదుపరి విచారణలో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది.