
Kantara Chapter 1 : 'కాంతార' ప్రీక్వెల్ నుంచి కొత్త అప్‌డేట్.. కులశేఖరుడి పోస్టర్ రిలీజ్!
ఈ వార్తాకథనం ఏంటి
కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం 'కాంతార చాప్టర్-1' (Kantara Chapter 1) సిద్ధమైంది. బ్లాక్‌బస్టర్ మూవీ 'కాంతార'కి ప్రీక్వెల్‌గా ఈ చిత్రం రాబోతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రమోషన్లను వేగవంతం చేశారు. ఇందులో భాగంగా ఇటీవల కథానాయిక రుక్మిణి వసంత్‌ను పరిచయం చేసిన చిత్ర బృందం, తాజాగా మరో కీలక పాత్రను బయటపెట్టింది. బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య ఈ సినిమాలో 'కులశేఖర' పాత్రలో కనిపించనున్నట్లు ప్రకటించారు.
Details
విలన్ పాత్రలో కులశేఖర
విడుదల చేసిన పోస్టర్ ద్వారా గుల్షన్ ఇందులో విలన్‌గా నటించనున్నట్టు స్పష్టమవుతోంది. ఈ చిత్రాన్ని హొంబాలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ నిర్మిస్తుండగా, సంగీతం అందిస్తున్నది అజ్నిశ్ లోకనాథ్. అంతేకాకుండా ఈ సినిమాను కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు.