Loading...
Priyanka Chopra: భార్య ప్రియాంకను ఆటపట్టించిన నిక్‌.. తనకు బాగా నచ్చేది అవేనట!

Priyanka Chopra: భార్య ప్రియాంకను ఆటపట్టించిన నిక్‌.. తనకు బాగా నచ్చేది అవేనట!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 15, 2026
10:22 am

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, ఆమె భర్త అమెరికన్‌ గాయకుడు-నటుడు నిక్‌ జోనాస్‌ మధ్య జరిగిన సరదా సంభాషణ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తమ దాంపత్య జీవితంలో తనకు అత్యంత నచ్చిన విషయాల్లో ఒకటి బాలీవుడ్‌కు సంబంధించిన గాసిప్‌లేనని నిక్‌ చెప్పడం అభిమానులను ఆకట్టుకుంటోంది. జోనాస్‌ బ్రదర్స్‌ నిర్వహిస్తున్న కొత్త పాడ్‌కాస్ట్‌ 'హే జోనాస్!' కార్యక్రమంలో నిక్‌ జోనాస్‌, ప్రియాంక చోప్రాతో పాటు కెవిన్‌ జోనాస్‌, జో జోనాస్‌ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత ఎనిమిదేళ్ల దాంపత్య జీవితం గురించి మాట్లాడిన నిక్‌.. "ఈ ఎనిమిదేళ్లలో నాకు చాలా నచ్చిన విషయాల్లో ఒకటి బాలీవుడ్‌ గాసిప్‌ల గురించి తెలుసుకోవడం" అని నవ్వుతూ చెప్పాడు.

వివరాలు

ఆ విషయాలను కూడా తెలుసుకుంటా

దీనిపై వెంటనే స్పందించిన ప్రియాంక చోప్రా.."మన పెళ్లిలో నీకు ఎక్కువగా నచ్చింది అదేనా? నీ సోషల్‌ మీడియా ఫీడ్‌ మొత్తం గాసిప్‌లతోనే నిండిపోయి ఉంటుందంటూ భర్తను సరదాగా ఆటపట్టించింది.

ఈ సందర్భంగా బాలీవుడ్‌లో ఎవరు ప్రేమలో ఉన్నారు, ఎవరు విడిపోయారు వంటి విషయాలు కూడా తనకంటే ముందే నిక్‌కు తెలిసిపోతాయని ప్రియాంక వెల్లడించింది.

"నేను ఎవరికైనా మెసేజ్‌ చేసి.. 'మీ పార్ట్‌నర్‌కు కూడా నా శుభాకాంక్షలు చెప్పండి' అంటే.. 'వాళ్లు ఇప్పుడు కలిసి లేరు.. విడిపోయారు' అని నిక్‌ చెబుతుంటాడు.

అప్పుడు బాలీవుడ్‌ గాసిప్‌లను తనే ఎక్కువగా ఫాలో అవుతున్నాడని అర్థమవుతుందని ఆమె నవ్వుతూ చెప్పింది.

వివరాలు

గాసిప్‌లను ఫాలో అవుతుంటా

ప్రియాంక వ్యాఖ్యలను సమర్థించిన నిక్‌ జోనాస్‌ కూడా "అవును.. నేను గాసిప్‌లను ఫాలో అవుతుంటానని అంగీకరించాడు.

అయితే ఏ సెలబ్రిటీల గురించి ఎక్కువగా తెలుసుకుంటావని కెవిన్‌, జో ప్రశ్నించగా.. వాళ్లంతా మన స్నేహితులే.. కానీ పేర్లు మాత్రం చెప్పలేనంటూ చిరునవ్వుతో సమాధానం ఇచ్చాడు.

అంతేకాకుండా, కొన్ని బాలీవుడ్‌ గాసిప్‌ సోషల్‌ మీడియా అకౌంట్లను తాను రహస్యంగా ఫాలో అవుతున్నానని కూడా నిక్‌ వెల్లడించాడు.

కొన్ని అకౌంట్లను ఎవరికీ తెలియకుండా ఫాలో అవుతుంటాను. వాటిలో వచ్చే కథనాలు, పరిణామాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయని చెప్పాడు.

ADVERTISEMENT

వివరాలు

2018లో నిశ్చితార్థం

ప్రియాంక చోప్రా, నిక్‌ జోనాస్‌ తొలిసారి 2017లో జరిగిన ఆస్కార్‌ ఆఫ్టర్‌ పార్టీ సందర్భంగా కలుసుకున్నారు.

అనంతరం 2018లో ప్రేమలో పడి, అదే ఏడాది నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ తర్వాత రాజస్థాన్‌లోని ఉమైద్‌ భవన్‌ ప్యాలెస్‌లో హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం ఘనంగా వివాహం చేసుకున్నారు.

2022లో సరొగసీ ద్వారా కుమార్తె మాల్టీ మేరీ చోప్రా జోనాస్‌ కు తల్లిదండ్రులయ్యారు.

ADVERTISEMENT