Loading...
Nidhi agerwal: నేడు ఈడీ విచారణకు హాజరుకానున్న నటి నిధి అగర్వాల్
నేడు ఈడీ విచారణకు హాజరుకానున్న నటి నిధి అగర్వాల్

Nidhi agerwal: నేడు ఈడీ విచారణకు హాజరుకానున్న నటి నిధి అగర్వాల్

వ్రాసిన వారు Moogati Shabari
Aug 19, 2026
01:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్‌ల ప్రచారానికి సంబంధించిన కేసులో సినీ నటి నిధి అగర్వాల్‌ నేడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల ఎదుట విచారణకు హాజరుకానున్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫారమ్‌లను ప్రమోట్ చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఈడీ అధికారులు ఆమెకు ముందస్తుగా సమన్లు జారీ చేశారు. ఈ క్రమంలో నిధి అగర్వాల్‌ స్టేట్‌మెంట్‌ను అధికారులు నేడు రికార్డు చేయనున్నారు.

వివరాలు

ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యవహారంలో మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు..

ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యవహారంలో మనీలాండరింగ్ కోణంలో ఈడీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ముఖ్యంగా బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేసిన సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల పాత్రపై దృష్టి సారించారు.

మియాపూర్‌కు చెందిన వ్యాపారవేత్త ఫణీంద్ర శర్మ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన అధికారులు.. ప్రముఖులు చేసిన ప్రకటనల ప్రభావంతో ప్రజలు బెట్టింగ్ యాప్‌లలో డబ్బులు పెట్టి నష్టపోయారా అనే అంశాన్ని పరిశీలిస్తున్నారు.

ఈ కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లో నిధి అగర్వాల్‌తో పాటు రానా దగ్గుబాటి, ప్రకాశ్‌రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత, అనన్య నాగళ్ల తదితర సినీ ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల పేర్లు కూడా ఉన్నాయి.

ADVERTISEMENT