Page Loader
విడాకులపై నీహారిక రెస్పాన్స్: ప్రైవసీ కావాలంటున్న మెగా డాటర్ 
విడాకులపై స్పందించిన నీహారిక

విడాకులపై నీహారిక రెస్పాన్స్: ప్రైవసీ కావాలంటున్న మెగా డాటర్ 

వ్రాసిన వారు Sriram Pranateja
Jul 05, 2023
01:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

మెగా డాటర్ నీహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డతో వివాహ బంధానికి ముగింపు పలికింది. వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని గత కొన్ని రోజులుగా సోషల్ మీడీయాలో వార్తలు వచ్చాయి. తాజాగా నీహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డ తమ బంధానికి స్వస్తి పలికారు. ఈ విషయమై ఇంస్టా లో స్పందించిన నీహారిక, తామిద్దరూ విడిపోతున్నట్లు చెబుతూ, ఇలాంటి పరిస్థితుల్లో తనకు అండగా నిలిచిన కుటుంబ సభ్యులకు దన్యవాదాలు తెలియజేసింది. అలాగే, ఈ దశ నుండి కొత్త జీవితం వైపు ప్రయాణించే సమయంలో తమకు ప్రైవసీ ఇవ్వాలని, అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ అంటూ ముగించింది నీహారిక. చైతన్య జొన్నలగడ్డతో నీహారిక వివాహం, 2020డిసెంబరులో జరిగింది.

ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేయండి

చైతన్య జొన్నలగడ్డతో విడాకులపై నీహారిక రెస్పాన్స్