
Karthikeya 3: 'కార్తికేయ 3'పై ఆసక్తికర అప్టేట్ ఇచ్చిన నిఖిల్
ఈ వార్తాకథనం ఏంటి
యంగ్ హీరో నిఖిల్ 'కార్తికేయ 3' మూవీపై ఆసక్తికర అప్టేట్ ఇచ్చాడు.
డైరెక్టర్ చందూ మొండేటి- నిఖిల్ కాంబినేషన్‌లో వచ్చిన కార్తికేయ, కార్తికేయ-2 సినిమాలు ఎంతటి ఘన విజయాలను సొంతం చేసుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
కార్తికేయ 2 మూవీ బాలీవుడ్‌లో కూడా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు వీరి కాంబినేషన్‌లో కార్తికేయ ఫ్రాంచైజీలో మూడో సినిమా రాబోతున్నట్లు నిఖిల్ ఆదివారం అధికారంగా ప్రకటించాడు.
'కార్తికేయ 3' మూవీ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసే పనిలో చందూ ఉన్నట్లు నిఖిల్ పేర్కొన్నాడు.
తాజా అప్డేట్‌తో నిఖిల్, కార్తికేయ ఫ్రాంచైజీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం నిఖిల్ భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో 'స్వయంభూ' చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నిఖిల్ ట్వీట్
Dr. Karthikeya In Search of a Brand new Adventure ... Soon🔥 @chandoomondeti #Karthikeya3 #Karthikeya2 #cinema #adventure pic.twitter.com/xoNeD3F2KI
— Nikhil Siddhartha (@actor_Nikhil) March 16, 2024