
Swayambhu: హీరో నిఖిల్ ప్రధాన పాత్రలో స్వయంభు.. సినిమాపై హైప్ పెంచిన పోస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
హ్యాపీడేస్ సినిమాతో హీరోగా కెరీర్ ప్రారంభించిన నిఖిల్ సిద్ధార్థ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా మారాడు.
లవ్, యాక్షన్ చిత్రాలతో అలరిస్తున్న నిఖిల్.. ఇప్పుడు పీరియాడిక్ డ్రామాతో అలరించేందుకు రెడీ అవుతున్నాడు.
కార్తీకేయ-2 మూవీతో నార్త్ లోనూ క్రేజ్ సంపాదించుకున్న నిఖిల్.. ఇప్పుడు వరుసగా భారీ బడ్జెట్ ప్రాజెక్ట్స్ చేసేందుకు రెడీ అయ్యాడు.
ప్రస్తుతం నిఖిల్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం స్వయంభు.ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ మూవీపై క్యూరియాసిటిని కలిగించాయి.
పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ మూవీలో నిఖిల్ యోధుడిగా కనిపించనున్నాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్న వివరాలను అనౌన్స్ చేయనున్నారు.
Details
సినిమా కోసం నిఖిల్ కత్తిసాము, గుర్రపు స్వారీ, కర్రసాము
ఇక ఇప్పుడు ఈ మూవీపై మరింత హైప్ పెంచే విధంగా నిఖిల్ పోస్ట్ చేశాడు.
ఈ చిత్రానికి ప్రపంచంలోనే అత్యుత్తమ టెక్సీషియన్స్ వర్క్ చేస్తున్నట్లు తెలిపాడు.
ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియో నిర్మాణంలో భువన్, శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు.
ఇందులో సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
సినిమా కోసం నిఖిల్ కత్తిసాము, గుర్రపు స్వారీ, కర్రసాము లాంటివి నేర్చుకున్నాడు.
ఇందుకు సంబంధించిన వీడియోస్ కూడా నెట్టింట వైరలయ్యాయి.దీంతో ఇప్పుడు ఈ మూవీపై మరిన్ని అంచనాలు పెరిగాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మేకర్స్ చేసిన ట్వీట్
Team #Swayambhu is filming an epic war episode on a grand scale.
— Pixel Studios (@PixelStudiosoff) May 7, 2024
The schedule, that will last for 12 days, is being filmed with a Massive budget of Rs. 8 Crore and will show @actor_Nikhil's prowess in action and stunts. This sequence will be stunning on the big screens ❤🔥 pic.twitter.com/YVuTP66kPM