LOADING...
'నరకాసుర' మూవీ.. 'మనసులను హత్తుకునే నిన్ను వదిలి' సాంగ్ రిలీజ్ 
నరకాసుర నుండీ మొదటి పాట విడుదల

'నరకాసుర' మూవీ.. 'మనసులను హత్తుకునే నిన్ను వదిలి' సాంగ్ రిలీజ్ 

వ్రాసిన వారు Sriram Pranateja
Sep 22, 2023
02:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

నరకాసుర సినిమా నుంచి చిత్ర బృందం సాంగ్ రిలీజ్ చేసింది. 'నిన్ను వదిలి నేనుండగలనా' అంటూ సాగే ఆ ఆ పాట హృదయాలను తాకుతోంది. చెరువులో నీళ్ళు కదులుతున్నట్లు, పిల్లగాలి మెల్లగా చెంపలను తాకివెళ్తున్నట్లుగా ఈ పాట ఉంటుంది. పలాస 1978 సినిమాతో అందరినీ ఆకట్టుకున్న హీరో రక్షిత్, ప్రస్తుతం నరసాసుర సినిమాతో వస్తున్నాడు. సెబాస్టియన్ నో అకోస్టా జూనియర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో, అపర్ణ జనార్ధన్, సంగీర్తన విపిన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ పాటకు సంగీతాన్ని నాఫాల్ రాజా అందించగా, సాహిత్యాన్ని శ్రీరామ్ తపస్వి అందజేసారు. విజయ్ ప్రకాష్, చిన్మయి శ్రీపాద సంయుక్తంగా ఈ పాటను ఆలపించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నరకాసుర సాంగ్ విడుదలపై ట్వీట్