Loading...
Alias Rukmini : నాని నిర్మాణంలో నితిన్ కొత్త సినిమా.. 'అలియాస్ రుక్మిణి' గ్లింప్స్ విడుదల

Alias Rukmini : నాని నిర్మాణంలో నితిన్ కొత్త సినిమా.. 'అలియాస్ రుక్మిణి' గ్లింప్స్ విడుదల

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 03, 2026
11:19 am

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌లో ఆసక్తికరమైన కాంబినేషన్‌కు తెరలేచింది. నేచురల్ స్టార్ నాని నిర్మాతగా, యూత్ స్టార్ నితిన్ హీరోగా ఓ కొత్త చిత్రం రూపొందుతోంది. 'కోర్ట్' సినిమాతో నిర్మాతగా బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుని, తన నిర్మాణ సంస్థ వాల్‌పోస్టర్ సినిమాస్ బ్యానర్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన నాని.. ఇప్పుడు మరో విభిన్న కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రానికి 'దండోరా' సినిమాతో గుర్తింపు పొందిన మురళి కాంత్ దర్శకత్వం వహిస్తున్నారు.

వివరాలు

'అలియాస్ రుక్మిణి'గా టైటిల్ ఖరారు

ఈ చిత్రానికి 'అలియాస్ రుక్మిణి' అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేస్తూ చిత్రబృందం ఓ ప్రత్యేక అనౌన్స్‌మెంట్ వీడియోను విడుదల చేసింది.

టైటిల్‌తో పాటు వీడియోను బట్టి చూస్తే, ఈ సినిమా క్లాసిక్ లవ్ స్టోరీతో పాటు ఆహ్లాదకరమైన ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

మళ్లీ తన బలమైన జోనర్‌లోకి నితిన్

ఇటీవలి కాలంలో మాస్, యాక్షన్ జోనర్లలో సినిమాలు చేసిన నితిన్.. ఈసారి తనకు మంచి విజయాలు అందించిన రొమాంటిక్ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ జోనర్‌లోకి మళ్లీ అడుగుపెడుతున్నారు.

ఈసినిమా నితిన్ కెరీర్‌లో ప్రత్యేకమైన చిత్రంగా నిలిచే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అంతేకాదు.. ఆయనకు ఇది గ్రాండ్ కంబ్యాక్ మూవీగా నిలిచే స్థాయి కంటెంట్ ఉందని ఇన్‌సైడ్ వర్గాలు చెబుతున్నాయి.

వివరాలు

నాని జడ్జ్‌మెంట్‌పై ప్రేక్షకుల్లో నమ్మకం

నిర్మాతగా ఎప్పుడూ వైవిధ్యమైన, కొత్త తరహా కథలకే ప్రాధాన్యం ఇచ్చే నానికి ఈ కథ ఎంతో నచ్చడంతో స్వయంగా నిర్మించేందుకు ముందుకొచ్చినట్లు తెలుస్తోంది.

నిర్మాతగా ఇప్పటివరకు వంద శాతం విజయాలను అందుకున్న నాని కథల ఎంపికపై ప్రేక్షకుల్లో మంచి నమ్మకం ఉంది.

దీంతో నితిన్ - నాని - మురళి కాంత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'అలియాస్ రుక్మిణి' సినిమాపై ఇప్పటికే సినీ అభిమానుల్లో భారీ అంచనాలేర్పడ్డాయి.

ADVERTISEMENT