
Robinhood : నితిన్ 'రాబిన్ హుడ్' ఫస్ట్ షో రివ్యూ.. హిట్ అవుతుందా?
ఈ వార్తాకథనం ఏంటి
నితిన్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'రాబిన్ హుడ్'. వరుస ప్లాపులతో కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ యంగ్ హీరో, గతంలో తనకు 'భీష్మ' వంటి సూపర్ హిట్ అందించిన వెంకీ కుడుములను మరోసారి నమ్ముకున్నాడు.
నితిన్‌కు జోడిగా యంగ్ బ్యూటీ శ్రీలీల నటించగా, తమిళ సంగీత దర్శకుడు GV ప్రకాష్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.
టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ నిర్మించిన ఈ సినిమా అనేక సార్లు వాయిదా పడిన తర్వాత ఎట్టకేలకు నేడు వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలో విడుదలైంది.
ఇప్పుడు ఓవర్సీస్ ప్రీమియర్స్ నుండి వస్తున్న టాక్ ఎలా ఉందో చూద్దాం.
Details
ఫస్టాప్ ఓకే
కొత్తదనం లేకుండా రొటీన్ కమర్షియల్ ఫార్మాట్‌ను ఫాలో అవుతూ కథ ముందుకు సాగింది. కొన్ని చోట్ల కామెడీ బాగా క్లిక్ అయింది.
అయితే కథానిర్మాణంలో కొంత గందరగోళం కనిపించింది. అయితే, ఇంటర్వెల్ ఫైట్ మాత్రం స్టైలిష్‌గా డిజైన్ చేశారు. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది.
సెకండ్ హాఫ్ కు మిశ్రమ స్పందన
శ్రీలీల రోల్ కొంత ఇరిటేట్ చేసినప్పటికీ, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ మాత్రం తమదైన కామెడీతో ప్రేక్షకులను నవ్వించారు.
కథలో మరికొంత పదును పెడితే సినిమాకు మరింత బలమైన హైపర్ లభించేది. హైప్ క్రియేట్ చేసిన క్రికెటర్ డేవిడ్ వార్నర్ పాత్ర కేవలం చివరి ఐదు నిమిషాల్లో మాత్రమే కనిపించి, సీక్వెల్‌కు లీడ్ ఇచ్చాడు.
Details
పాటలు మైనస్
ఈ సినిమాకు సంగీతం పెద్దగా బలంగా నిలవలేదు. ఒక్క పాట కూడా గుర్తుండేలా లేదని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
మొత్తంగా, 'రాబిన్ హుడ్' ఓకేయిష్ సినిమా. ఓవర్సీస్ నుండి వచ్చే రిపోర్ట్స్ ప్రకారం, ఇది అత్యుత్తమ సినిమా కాకపోయినా, పూర్తి మిస్సవ్వాల్సినదీ కాదు.
మరికొంత కథలో కొత్తదనం, మ్యూజిక్‌లో ఇంపాక్ట్ ఉంటే సినిమాకు మరింత బలంగా నిలిచే అవకాశం ఉండేది.