
కుమారి శ్రీమతి టీజర్: వయసు పెరిగినా పెళ్ళి చేసుకోని అమ్మాయి పాత్రలో నిత్యా మీనన్
ఈ వార్తాకథనం ఏంటి
ఊహలు గుసగుసలాడే సినిమాతో దర్శకుడుగా మారిన నటుడు అవసరాల శ్రీనివాసరావు, ప్రస్తుతం మరొక కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈసారి దర్శకుడిగా కాదు కథా రచయితగా మాత్రమే ప్రేక్షకులను పలకరించనున్నాడు.
నిత్యామీనన్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న కుమారి శ్రీమతి అనే వెబ్ సిరీస్ కి శ్రీనివాస్ అవసరాల కథ అందించారు. తాజాగా, ఈ సిరీస్ టీజర్ విడుదలైంది.
42సెకండ్ల ఈ టీజర్ లో వయసు పెరిగినా పెళ్లంటే ఇష్టం లేని అమ్మాయి పాత్రలో నిత్యమీనన్ కనిపిస్తోంది. టీజర్ లో కనిపించిన ప్రతీ పాత్ర పెళ్ళెప్పుడు చేసుకుంటావని నిత్యామీనన్ పాత్రను అడుగుతూ కనిపిస్తారు.
Details
ఎంటర్ టైనింగ్ గా కనిపిస్తున్న టీజర్
ఇంకా పెళ్లి చేసుకోవా అంటూ తనని అడిగిన వాళ్లందరికీ నిత్యామీనన్ ఇచ్చే సమాధానం టీజర్ చివర్లో కనిపిస్తుంది. ఆ సమాధానం విన్న తర్వాత కుమార్ శ్రీమతి మంచి ఎంటర్ టైనింగ్ సిరీస్ గా ఉండబోతుందని తెలుస్తుంది.
ఈ సిరీస్ కు స్క్రీన్ ప్లే, మాటలను కూడా శ్రీనివాస్ అవసరాల అందించారు. స్టకాటో, కామ్రాన్ సంగీతం అందించిన ఈ సిరీస్ ను గొంటేష్ ఉపాధ్యే దర్శకత్వం వహించారు.
ఈ సిరీస్ లో సీనియర్ యాక్టర్ నరేష్. సీనియర్ హీరోయిన్ గౌతమి, తాళ్లూరి రామేశ్వరి, ప్రేమ్ సాగర్, ప్రణీత పట్నాయక్, ఉషశ్రీ ఇతర కీలక పాత్రలో కనిపించనున్నారు.
తెలుగు, తమిళం, మలయాళం. హిందీ భాషల్లో సెప్టెంబర్ 22నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కుమారి శ్రీమతి టీజర్
ఎవరీ కుమారి శ్రీమతి?
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) September 20, 2023
குமாரி ஶ்ரீமதி யாரு?
ഈ കുമാരി ശ്രീമതി ആരാണ്?
कौन है ये कुमारी श्रीमती?
Here's the teaser of #KumariSrimathi: https://t.co/82xBvkNQqj
Streaming from September 28th on @PrimeVideoIN.@MenenNithya @Sri_Avasarala @gomtesh_upadhye @iamThiruveer @PatnaikPraneeta… pic.twitter.com/KqFHBuunNm