LOADING...
BMB First Look: నివేదా థామస్ తమ్ముడు హీరోగా ఎంట్రీ.. 'బెంగళూరు మహానగరంలో బాలక' ఫస్ట్ లుక్ విడుదల
నివేదా థామస్ తమ్ముడు హీరోగా ఎంట్రీ.. 'బెంగళూరు మహానగరంలో బాలక' ఫస్ట్ లుక్ విడుదల

BMB First Look: నివేదా థామస్ తమ్ముడు హీరోగా ఎంట్రీ.. 'బెంగళూరు మహానగరంలో బాలక' ఫస్ట్ లుక్ విడుదల

వ్రాసిన వారు Jayachandra Akuri
May 26, 2026
12:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

మంత్ర మూవీ మేకర్స్, ఫాల్కన్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రం 'బెంగళూరు మహానగరంలో బాలక'. మహి - రాజ్ ద్వయం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పూర్తి వినోదాత్మక కథాంశంతో తెరకెక్కుతోంది. ముఖ్యంగా బెంగళూరు మహానగరానికి వెళ్లిన ఓ ఆంధ్ర యువకుడు అక్కడ ఎదుర్కొనే కష్టాలు, సవాళ్లు, సరదా సంఘటనల నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇటీవల వరంగల్, హనుమకొండ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్ విజయవంతంగా పూర్తైంది. ఈ సందర్భంగా చిత్ర బృందం విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ నటుడు ప్రియదర్శి విడుదల చేశారు.

వివరాలు

ఫస్ట్ లుక్‌తోనే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచిన మూవీ

ఈ చిత్రంతో స్టార్ హీరోయిన్ నివేదా థామస్ తమ్ముడు నిఖిల్ థామస్ హీరోగా టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. కొత్త కథతో రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు మల్లూ నాయక్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, విశ్వదీప్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. హర్షిత్ కొటా ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. సరికొత్త కథాంశంతో పక్కా ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న 'బెంగళూరు మహానగరంలో బాలక' చిత్రం ఫస్ట్ లుక్‌తోనే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.

Advertisement