
#NKR 21: యాక్షన్ మోడ్ లో కళ్యాణ్ రామ్; కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది
ఈ వార్తాకథనం ఏంటి
బింబిసార, అమిగోస్ చిత్రాల తర్వాత డెవిల్ అనే సినిమాతో కళ్యాణ్ రామ్ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కళ్యాణ్ రామ్ పుట్టినరోజును పునస్కరించుకుని మరో కొత్త సినిమా ప్రకటన వచ్చింది.
కళ్యాణ్ రామ్ కెరీర్లో 21వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి అనౌన్స్ మెంట్ పోస్టర్ ను రిలీజ్ చేసారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాను ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేస్తున్నారు.
అశోకా క్రియేషన్, నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మాతలుగా ఉన్నారు.
ఈ సినిమాలో హీరోయిన్, ఇతర పాత్రల్లో ఎవరెవరు నటిస్తున్నారో తెలియాల్సి ఉంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కళ్యాణ్ రామ్ 21వ సినిమా ప్రకటన వచ్చేసింది
The FIST of FURY 🔥👊🔥@NANDAMURIKALYAN in an action-packed powerful role ❤️🔥#NKR21 shoot begins soon 🔥#HappyBirthdayNKR @PradeepChalre10 #AshokaMuppa @SunilBalusu1981 @harie512 @NTRArtsOfficial @AshokaCOfficial pic.twitter.com/ljUZUXOk3o
— Ashoka Creations (@AshokaCOfficial) July 5, 2023