Meena : ఏ హీరో విడాకులు తీసుకున్నా నన్నే లింక్ చేస్తున్నారు : హీరోయిన్ అవేదన
ఈ వార్తాకథనం ఏంటి
ఒకప్పుడు భాషా భేదాలు లేకుండా దాదాపు ప్రతి ఇండస్ట్రీలోని టాప్ హీరోలతో నటించి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన సీనియర్ హీరోయిన్ మీనా. అనేక దశాబ్దాల సినీప్రస్థానంలో అనేక హిట్ చిత్రాలతో ప్రేక్షకులను ఆమె ఆకట్టుకుంది. ఇంకా అదే ఆకర్షణ, అదే ఉత్సాహంతో చిత్రసీమలో యాక్టివ్‌గా కొనసాగుతున్నారు. సినిమాలతోపాటు, ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో కూడా తరచూ కనిపిస్తూ, తన కుటుంబం, ఆరోగ్యపరమైన సమస్యలు, కెరీర్ అనుభవాల గురించి నిజాయితీగా పంచుకుంటున్నందున అభిమానులకు మరింతగా దగ్గరవుతున్నారు. తాజాగా మీనా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక కీలక విషయాన్ని వెల్లడించారు.
Details
రీ-మ్యారేజ్ అంటూ రూమర్లు క్రియేట్ చేస్తున్నారు
ప్రస్తుతం నా జీవితం మొత్తం నా పాప చుట్టూనే తిరుగుతోంది. ఆమె నా ఆనందం, నా బలం, నా శాంతి. ఆమెతో గడపడమే నాకు పెద్ద సంతోషం" అని అన్నారు. అదే సమయంలో, తనపై బయట ప్రపంచంలో వ్యాపిస్తున్న వదంతులపై మీనా అసంతృప్తి వ్యక్తం చేశారు. "ఎవరైనా హీరో విడాకులు తీసుకున్నారు అంటే వెంటనే నన్ను లింక్ చేసి కథలు రాస్తున్నారు. నాకు పెళ్లి అవబోతుందంటూ, రీ-మ్యారేజ్ అంటూ రూమర్లు క్రియేట్ చేస్తున్నారు. ఇవన్నీ పూర్తిగా ఆధారరహిత వార్తలు. నా వ్యక్తిగత జీవితంలో అలాంటిది ఏమీ జరుగడం లేదని ఆమె స్పష్టం చేశారు. ఇక కెరీర్ విషయానికి వస్తే, మీనా తన తిరిగి రీఎంట్రీ ఎలా జరిగిందో కూడా వివరించారు.
Details
మంచి స్క్రిప్టులు వరుసగా వస్తున్నాయి
"నా పాప పుట్టిన తర్వాత పూర్తిగా ఆమెకే సమయాన్ని కేటాయించా. ఆ సమయంలో 'దృశ్యం' మలయాళ వెర్షన్ ఆఫర్ వచ్చింది. మొదట పాపను వదిలి షూటింగ్‌కు వెళ్లలేనని రిజెక్ట్ చేశాను. కానీ కథ నన్ను బాగా ఆకట్టుకోవడంతో చివరికి ధైర్యం చేసి ఆ సినిమా చేసాను. అదృష్టవశాత్తూ అది నాకు మరో పెద్ద మలుపు అయ్యిందని తెలిపారు. ప్రస్తుతం కూడా మంచి స్క్రిప్టులు వరుసగా వస్తున్నాయని, తనను ఛాలెంజ్ చేసే పాత్రలు వస్తే నిరభ్యంతరంగా సినిమాలు చేస్తానని మీనా అన్నారు. ఆమె చెప్పిన ఈ నిజాయితీని అభిమానులు విపరీతంగా అభినందిస్తున్నారు. మీనాను రూమర్లు ఎప్పుడూ కదిలించలేవని, ఆమె మరిన్ని మంచి పాత్రలతో మళ్లీ ప్రేక్షకులను అలరించాలని కామెంట్లు చేస్తున్నారు.