LOADING...
Anil Ravipudi : అనిల్ రావిపూడితో రామ్ కొత్త సినిమా ఫిక్స్
అనిల్ రావిపూడితో రామ్ కొత్త సినిమా ఫిక్స్

Anil Ravipudi : అనిల్ రావిపూడితో రామ్ కొత్త సినిమా ఫిక్స్

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 30, 2025
01:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవలి వరుస వైఫల్యాల తరువాత,టాలీవుడ్ యువ హీరో రామ్ పోతినేని ఇప్పుడు సినిమాల ఎంపికలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇకపై కాంబినేషన్ల కంటే కథా బలం పైనే దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈ నిర్ణయం తర్వాత, కేవలం ఒకే సినిమా దర్శకత్వం వహించిన మహేశ్ బాబు పి దర్శకత్వంలో రామ్ నటిస్తున్న "ఆంధ్ర కింగ్" చిత్రం రూపుదిద్దుకుంటోంది. ప్రముఖ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది.

వివరాలు 

సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ తో  రామ్ కొత్త సినిమా 

ఈ సినిమా పూర్తవుతుండగానే రామ్ తన తదుపరి ప్రాజెక్ట్ పై దృష్టి సారించాడు. సీనియర్ దర్శకుడు హరీష్ శంకర్ రామ్‌కి ఓ కథ చెప్పినట్లు, అది దాదాపుగా ఫైనల్ అయిందని టాక్ వినిపించింది. అయితే ఆ ప్రాజెక్ట్ అమల్లోకి రాలేదు. అదే విధంగా, మరో ఇద్దరు దర్శకులు కూడా రామ్‌కు కథలు చెప్పినప్పటికీ, అవి కూడా సెట్ కాలేదు. అయితే, తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం రామ్ కొత్త సినిమా ఒక సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ తో లాక్ అయినట్టు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు,రామ్ పోతినేని హీరోగా,హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో కొత్త చిత్రం ఖరారైంది.

వివరాలు 

SVC బ్యానర్ పై భారీ స్థాయిలో నిర్మాణం 

వాస్తవానికి ఈ కాంబినేషన్ చాలా కాలం క్రితమే రావాల్సింది.'రాజా ది గ్రేట్' సినిమా మొదట రామ్ పోతినేని హీరోగా అనుకున్నారని,కానీ కొన్ని కారణాల వల్ల ఆ సమయంలో రామ్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని టాక్. ఎన్నాళ్లకెన్నాళ్లకు ఇప్పుడు రామ్-అనిల్ రావిపూడి కాంబినేషన్ చివరికి నిజం కాబోతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన SVC బ్యానర్ పై భారీ స్థాయిలో నిర్మించబోతున్నారు.