LOADING...
November 7 Telugu Movie Releases: నవంబర్ 7: ప్రేక్షకులను పలకరించడానికి రెడీగా పలు సినిమాలు
ప్రేక్షకులను పలకరించడానికి రెడీగా పలు సినిమాలు

November 7 Telugu Movie Releases: నవంబర్ 7: ప్రేక్షకులను పలకరించడానికి రెడీగా పలు సినిమాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 05, 2025
10:13 am

ఈ వార్తాకథనం ఏంటి

నవంబర్ 7న థియేటర్లలో కాస్త చిన్న సినిమాల నుండి పెద్ద సినిమాల వరకూ పలు చిత్రాలు వరుసగా విడుదలకు సిద్ధమవుతున్నాయి. వాస్తవానికి నవంబర్ 7వ తేదీన అనూహ్యంగా చాలా సినిమాలు రిలీజ్‌కి రెడీ అవ్వడం గమనార్హం. ఆ రోజున విడుదలయ్యే గుర్తింపు పొందిన చిత్రాల్లో రష్మిక ప్రధాన పాత్రలో వచ్చిన 'ది గర్ల్ ఫ్రెండ్', సుధీర్ బాబు హీరోగా నటించిన 'జటాధర' ముఖ్యమైనవి. వీటితో పాటు తిరువీర్ నటించిన 'ప్రీవింగ్ షో', విష్ణు విశాల్ ప్రధాన పాత్రలో వచ్చిన 'ఆర్యన్' కూడా అదే తేదీన ప్రేక్షకులను పలుకరించనున్నాయి. ఇవన్నీ మాత్రమే కాదు,విజయ్ సేతుపతి కుమారుడు హీరోగా నటించిన 'ఫినిక్స్' కూడా నవంబర్ 7న తెలుగులో విడుదలకు సిద్ధమైంది.

వివరాలు 

 ప్రశంసలు అందుకున్న 'డయాస్ ఇరాయి'

అలాగే మలయాళ మెగాస్టార్ మోహన్‌లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్‌ లాల్ ప్రధాన పాత్రలో నటించిన హారర్ చిత్రం 'డయాస్ ఇరాయి' కూడా అంతే రోజున తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం మలయాళంలో విడుదలైనప్పుడు మంచి ప్రశంసలు అందుకుంది. ఇంకా ఒక బాలనటుడు హీరోగా నటించిన 'ప్రేమిస్తున్న' అనే చిత్రం కూడా అదే రోజున రావడానికి ప్లాన్ చేస్తున్నారు. మేకర్స్ మాత్రం "ఈ సినిమా కూడా ఆర్ఎక్స్ 100, బేబీ తరహా భావోద్వేగ, బోల్డ్ కంటెంట్‌తో వస్తుంది" అంటూ ప్రచారంలో బాగానే దూకుతున్నారు. ఇక ఈన్నింటితో పాటు 'వృషభ', 'హరికథ' వంటి మరో రెండు చిన్న సినిమాలు కూడా రిలీజ్ లైన్‌లో ఉన్నప్పటికీ, వీటికి మేకర్స్ పెద్దగా ప్రమోషన్ చేయడం లేదు.